లోక్ సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మృతి చెందారనే వార్త దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ముంబై మీడియా సహా కాంగ్రెస్ నేత, ఎంపీ శశిధరూర్ సైతం సుమిత్ర చనిపోయారంటూ ట్వీట్ చేశారు. దీంతో పెద్ద దుమారమే రేగింది. దీనిపై సుమిత్ర స్పందించారు.
‘ఆధారాలు లేకుండా ఇటువంటి వార్తలు వస్తే నేనేం చేసేది. ఇండోర్ జిల్లా అధికారులనైనా కనుకోవాల్సింది. బంధువల నుంచీ నాకూ ఫోన్లు వస్తున్నాయి. నా మేనకోడలు సైతం శశిధరూర్ ను ప్రశ్నించింది. ఈ అంశంపై స్పీకర్ ఓం బిర్లా పరిశీలించాలని కోరుతున్నా’ అని ఆమె మాట్లాడిన ఆడియో క్లిప్పును ఆమె కుమారుడు మందార్ ట్వీట్ చేశారు.
‘అత్యంత నమ్మకస్థులిచ్చిన సమాచారం నిజమని నమ్మాను. సుమిత్ర ఆరోగ్యంగా ఉంటే అంతకుమించిన సంతోషం లేదు. సుమిత్రాజీ కుమారుడితో మాట్లాడి క్షమాపణ కూడా చెప్పాను. ఆయన అర్ధం చేసుకున్నారు’ అని శశిధరూర్ ట్వీట్ చేశారు. తన తల్లి సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని.. ఆమెపై వచ్చే తప్పుడు వార్తలు నమ్మొద్దని మందార్ ట్వీట్ చేశారు.
Recent Random Post: