నువ్వెందుకు వచ్చావ్‌ వార్నర్‌ అన్నః ఈషారెబ్బా

నిన్న ఐపీఎల్ లో భాగంగా సన్‌ రైజర్స్‌ హైదరాబాద్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ ల మద్య జరిగిన మ్యాచ్‌ టై అయ్యింది. సూపర్‌ ఓవర్‌ లో ఫలితాన్ని ఖరారు చేయడం జరిగింది. సూపర్‌ ఓవర్‌ కూడా రసవత్తరంగా సాగింది. సూపర్‌ ఓవర్‌ లో మొదట బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ కు వార్నర్‌ మరియు విలియమ్‌సన్‌ లు బ్యాటింగ్‌ చేశారు. వార్నర్‌ అసలే సరిగ్గా బ్యాటింగ్‌ చేయలేదు. మళ్లీ సూపర్‌ ఓవర్‌ లో బ్యాటింగ్‌ చేసేందుకు రావడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మొదటి బాల్ నే వృదా చేసిన వార్నర్‌ చివరి బంతికి రెండు పరుగులు వచ్చినా బ్యాట్ ను సరిగ్గా పెట్టక పోవడం వల్ల ఒక్క పరుగే వచ్చింది. ఆ పరుగు వచ్చి ఉంటే ఫలితం హైదరాబాద్‌ వైపు వచ్చేది.

వార్నర్ చేసిన పనిపై సోషల్‌ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలుగమ్మాయి, హీరోయిన్‌ ఈషా రెబ్బ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ.. వార్నర్‌ అన్న ఏంటి ఇది, నువ్వు ఎందుకు వచ్చావు.. బెయిన్‌ స్టో లేదా సుచిత్‌ ను పంపి ఉండవచ్చు. నీకు టీమ్‌ ను నిర్మించుకోవాలనుకుంటే డ్రీమ్‌ 11 లో నిర్మించుకో అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేసింది. ఈషా రెబ్బ ట్వీట్ ను చాలా మంది సమర్థిస్తున్నారు. మొత్తానికి వార్నర్‌ పై నెట్టింట విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.


Recent Random Post: