గుడ్‌ న్యూస్‌.. ఆరోగ్య శ్రీలో కరోనా

పక్క రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కనుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా కరోనా చికిత్స ను ఖచ్చితంగా ఆరోగ్య శ్రీలో చేర్చాల్సిందే అంటూ జనాలు డిమాండ్ చేస్తున్నారు. విపక్షాలతో పాటు అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ సమయంలో కరోనా చికిత్స భారం అవుతుందని ఆరోపరణలు చేస్తున్న నేపథ్యంలో కేటీఆర్‌ స్పందించాడు. సీఎం కేసీఆర్‌ తో మాట్లాడుతామంటూ హామీ ఇచ్చాడు.

ట్విట్టర్ ద్వారా కొందరు నెటిజన్స్ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానం చెప్పాడు. ఆ సందర్బంగా ఎక్కువ మంది కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీలో ఎందుకు చేర్చడం లేదు అంటూ ప్రశ్నించాడు. అందుకు సమాధానంగా కేటీఆర్‌ స్పందిస్తూ కరోనా చికిత్స కొసం ప్రైవేట్‌ ఆసుపత్రికి వెళ్లిన వారికి భారీగా ఖర్చు అవుతున్న మాట వాస్తవమే.. వారి అడ్డగోలు వసూళ్లను అడ్డుకుని ఫీజులను తగ్గించాల్సిన అవసరం ఉంది. ఇదే సమయంలో ఖచ్చితంగా కరోనా చికిత్స ను ఆరోగ్య శ్రీ లో చేర్చే విషయమై కూడా సీఎంతో చర్చిస్తామని ఈ సందర్బంగా కేటీఆర్‌ పేర్కొన్నాడు.


Recent Random Post: