ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు వెలువరించిన తీర్పు పట్ల జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తంచేశారు. ఇది ప్రజాస్వామ్యానికి, స్థానిక స్వపరిపాలనకు ఊపిరి పోసే తీర్పు అని అభివర్ణించారు. ఆ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పవన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా పంతాలకు, పట్టింపులకు పోకుండా తాజా నోటిఫికేషన్ జారీచేసి ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేసిన మరుసటి రోజే ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు చేపట్టిన రోజే హడావుడిగా పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు.
దీనిపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తంచేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయలేదంటూ విపక్షాలన్నీ విమర్శలు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ లేదని అభిప్రాయపడింది. దీంతో వాటిని రద్దు చేసింది.
Recent Random Post: