పవన్‌ కు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా?

హీరోలు చాలా మంది ఆహారం విషయంలో తమకు తాము చాలా కండీషన్స్ పెట్టుకుని ఉంటారు. వర్కౌట్స్ చేస్తూ ఎక్కువ శాతం మంది డైటింగ్‌ చేస్తూ ఉంటారు. అయితే కొందరు హీరోలు మాత్రం వారంలో కనీసం రెండు రోజులు అయినా ఇష్టం అయిన ఆహారం తీసుకుంటూ ఉంటారు. ఆహార ప్రియుడు అయిన ప్రభాస్‌ అన్ని రకాల బిర్యాణీలను రెగ్యులర్ గా రుచి చూస్తూనే ఉంటాడు. ఇక పవన్‌ కు ఇష్టమైన ఆహారం విషయానికి వస్తే ఆయనకు సీ ఫుడ్‌ అంటే చాలా ఆసక్తి చూపిస్తాడట.

పవన్‌ కళ్యాణ్‌ కు చెపల పులుసు ముఖ్యంగా నెల్లూరు చెపల పులుసు ను ఇష్టపడుతాడు. పవన్ కు నాటు కోడి కూర అంటే కూడా చాలా ఇష్టమట. ఇక చివరగా పవన్‌ పులిహోర ప్రియుడు అని కూడా ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. మొత్తానికి చేపల పులుసు మరియు నాటుకోడి కూర పులిహోర ఉంటే పవన్‌ కు వింధు భోజనం అన్నమాట. ఆయన కరోనా బారిన పడ్డ సమయంలో కూడా వీటిని అధికంగా తిన్నాడని ఆయన వైధ్యులు చెబుతున్నారు. పూర్తిగా రికవరీ అయిన పవన్‌ కళ్యాణ్ త్వరలో షూటింగ్‌ కు జాయిన్ అవ్వబోతున్నాడు.


Recent Random Post: