మరోసారి అండర్ కవర్ కాప్ గా మహేష్?

సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల విషయంలో ఆసక్తికరంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో నెల రోజుల పాటు సాగింది. ఆ తర్వాత హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టారు కానీ కరోనా కారణంగా షూటింగ్ అర్ధాంతరంగా నిలిచిపోయింది.

ఇదిలా ఉంటే సర్కారు వారి పాట చిత్రం తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ ఎస్ చెప్పిన విషయం తెల్సిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి.

తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి తెల్సిన విషయం ఏమిటంటే ఇందులో మహేష్ అండర్ కవర్ కాప్ గా కనిపిస్తాడట. మహేష్ గతంలో అండర్ కవర్ గా చేసిన పోకిరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. మరి దీనిపై మరింత క్లారిటీ త్వరలో వచ్చే అవకాశముంది.


Recent Random Post: