జబర్దస్త్‌ లో మిస్సింగ్‌ పై గెటప్ శ్రీను క్లారిటీ

తెలుగు బుల్లి తెర ప్రేక్షకుల్లో జబర్దస్త్‌ ఎలాంటి ముద్ర వేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపుగా 9 ఏళ్ల నుండి కొనసాగుతున్న ఈ కామెడీ షో పేరు చెప్పగానే కొందరి పేర్లు గుర్తుకు వస్తాయి. అందులో సుడిగాలి సుధీర్ టీమ్‌. చాలా ఏళ్లుగా ఈ టీమ్‌ కలిసే స్కిట్ లు చేస్తున్నారు. అవకాశం ఉండి కొత్త టీమ్‌ లు ఏర్పాటు చేసేందుకు సుడిగాలి సుధీర్ టీమ్‌ రామ్ ప్రసాద్‌ మరియు గెటప్ శ్రీనులు వెళ్లలేదు. ఈ ముగ్గురు మరియు సన్నీ లు కలిసి కొన్ని వందల స్కిట్ లు చేశారు. కాని కొన్ని వారాలుగా గెటప్‌ శ్రీను ఈ స్కిట్స్ లో కనిపించడం లేదు.

అసలు గెటప్‌ శ్రీను ఏ షో లో కూడా కనిపించక పోవడంతో అసలేం జరిగింది అంటూ నెట్టింట చర్చ మొదలు అయ్యింది. బుల్లి తెర కమల్‌ హాసన్‌ అంటూ పేరు తెచ్చుకున్న గెటప్‌ శ్రీను జబర్దస్త్‌ కు గుడ్‌ బై చెప్పాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో గెటప్ శ్రీను క్లారిటీ ఇచ్చాడు. తాను ఒక సినిమా షూటింగ్‌ కు వెళ్లిన సమయంలో అక్కడ కొందరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. నాకు నెగటివ్‌ వచ్చినా కూడా కొన్ని రోజుల పాటు ఐసోలేషన్‌ లో ఉన్నాను. అందుకే జబర్దస్త్‌ షూటింగ్‌ కు హాజరు కాలేదు. కాని ఈనెల 18వ తారీకున రాబోతున్న జబర్దస్త్‌ తో మీ ముందుకు రాబోతున్నాను అంటూ స్పష్టం చేశాడు. గెటప్ శ్రీను ప్రకటనతో జబర్దస్త్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: