మా అధ్యక్షురాలి రేసులోకి హేమ!

మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల హంగామా విడుదలైంది. మా అధ్యక్ష పీఠం కోసం ఈసారి భారీ పోటీ ఉండబోతోంది. ఎందుకంటే ఇప్పటికే ఇద్దరు ప్రముఖులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతుండగా ఇప్పుడు నటి హేమ కూడా బరిలోకి దిగబోతోంది.

మంచు విష్ణువర్ధన్ బాబు మా అధ్యక్షుడిగా బరిలోకి దిగాడు. ఇండస్ట్రీ ప్రముఖులను కలిసి ఆశీర్వాదం కూడా తీసుకున్నాడు. అలాగే జీవితా రాజశేఖర్ కూడా ఈసారి అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతోంది. సీనియర్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా మా అధ్యక్షుడు అవ్వాలనుకుంటున్నాడు.

నటి హేమ కూడా బరిలో ఉన్నట్లు ప్రకటించింది. తాను మా ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పదవులు చేపట్టినట్లు తెలిపింది. మా సభ్యులు తనను అధ్యక్ష పదవికోసం పోటీ పడమన్నారని, తనను అధ్యక్షురాలిగా చూడాలనుకుంటున్నారు, అందుకే పోటీలో ఉన్నట్లు తెలిపారు.


Recent Random Post: