మా అధ్యక్ష ఎన్నికల హీట్ పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్బంగా నాగబాబు వారికి మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో నాగబాబు మా మసకబారి పోతుంది. గతంలో ఉన్నట్లుగా పరిస్థితులు లేవు. ఇటీవల కార్యవర్గం సంతృప్తికర పనితీరు కనబర్చలేదు అంటూ వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలను ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నటుడు నరేష్ ఖండించాడు. నాగబాబు అలా మాట్లాడటం చాలా బాధను కలిగించిందని అన్నాడు.
ఎన్నికల సమయంలో ఎవరైనా మీడియా సమావేశం ఏర్పాటు చేయవచ్చు. కాని గత కార్యవర్గంను దూషించే విధంగా అవమానించే విధంగా మాట్లాడటం ఏమాత్రం సబబు కాదు. నేను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఎన్నో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించాం. తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఇండస్ట్రీ పెద్దల దృష్టికి తీసుకు వెళ్లాము. దాదాపుగా 728 మంది మా సభ్యుల ఇళ్లకు తిరిగి వారికి జీవిత భీమా చేయించాము. ఇప్పటికే 16 మంది సభ్యులకు ఆ భీమా అందింది. మా సభ్యుల పెన్షన్ ను 3 వేల నుండి 6 వేలకు పెంచాం. ఇంకా మా సభ్యత్వ రుసుము లక్ష నుండి 90 వేలకు తగ్గించాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసిన తమపై విమర్శలు చేయడం బాగాలేదని నరేష్ ఆవేదన వ్యక్తం చేశాడు.
Recent Random Post: