టీడీజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్.. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు.. ఈ మధ్య సన్నబడ్డారు.. మరింత అగ్రెసివ్ అయ్యారు.. రాజకీయ ప్రసంగాల విషయంలో. క్రమక్రమంగా రాజకీయాల్లో రాటుదేలేందుకు నారా లోకేష్ సర్వశక్తులూ ఒడ్డుతున్న మాట వాస్తవం.
అయితే, దాదాపుగా జీరో అయిపోయిన తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ వల్ల ఎంత ప్రయోజనం.? అన్నది వేరే చర్చ. చంద్రబాబు.. తన కుమారుడు నారా లోకేష్ గురించి ఎంతలా తపనపడుతున్నారోగానీ, అంతకు మించి కష్టపడిపోతున్నట్టున్నారు రేవంత్ రెడ్డి, రాధాకృష్ణ. ఓ ప్రముఖ దినపత్రిక, ఓ ప్రముఖ ఛానల్ అధినేత అయిన రాధాకృష్ణకి, ఓ రాజకీయ పార్టీతో సంబంధమేంటి.?
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ రెడ్డికి నారా లోకేష్ ఎలా వుంటే ఏంటి.? నారా లోకేష్ కోసమే రేవంత్ రెడ్డి ఇంకా ఇంకా కష్టపడుతున్నట్టున్నారు. ఈ క్రమంలోనే రేవంత్ కష్టాన్ని గుర్తించిన చంద్రబాబు, టీడీపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఆయన్ని పంపి, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యేందుకు రేవంత్ రెడ్డికి సంపూర్ణ సహాయ సహకారాలు తెరవెనుకాల అందించినట్లున్నారు.
ఇక, రాధాకృష్ణ సంగతి సరే సరి. నిఖార్సయిన జర్నలిస్టునని చెప్పుకునే ఈ ఆర్కే.. టీడీపీకి కొమ్ముకాయడమే కాదు, ఇప్పుడు కొత్తగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార బాధ్యతలూ నెత్తికెత్తుకున్నట్టున్నారు. అంతేనా, టీవీ5 ఛానల్ కూడా తమదేనన్నట్లు కలిపేసుకోవడం రాధాకృష్ణకే చెల్లింది. నారా లోకేష్ ఇంకా కష్టపడాల్సి వుందనీ, జనంలో తిరగాల్సి వుందనీ ఆర్కే, రేవంత్ మధ్య చర్చ జరిగింది.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడయ్యాక రేవంత్, తనకు మీడియా పరంగా మద్దతు కోసం వివిధ మీడియా సంస్థల అధిపతుల్ని కలుస్తున్నారు. దీన్ని తప్పు పట్టాల్సిన పనేమీ లేదు. కాకపోతే, ఈ భేటీల సందర్భంగా రాజకీయ అంశాల చర్చ రావడం, ఈ క్రమంలో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు మీద రేవంత్, రాధా కృష్ణ బెంగపడటం అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
టీడీపీకి వేరే శతృవు అవసరంలేదు.. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడానికి ప్రధాన కారణాల్లో యెల్లో మీడియా కూడా ఒకటి. టీడీపీకి కొమ్మకాస్తున్నట్టే కనిపిస్తూ, వెన్నపోటు పొడవడంలో యెల్లో మీడియా ప్రత్యేకతే వేరు.
Recent Random Post: