రాజకీయ పార్టీలు వారి వారి కార్యకర్తల కోసం ఈమద్య కాలంలో ఇన్సురెన్స్ ను తీసుకు వస్తున్నారు. పార్టీ కార్యకర్తలు ఏదైనా ప్రమాదంలో చనిపోతే లేదా ప్రమాదంకు గురైతే వారికి ఆర్థిక భాసట కల్పించేందుకు గాను పార్టీలు మెంబర్ షిప్ తీసుకున్న వారికి సాయంగా నిలుస్తున్నారు. జనసేన పార్టీ కూడా తమ కార్యకర్తల కోసం సాయం చేసేందుకు సిద్దం అయ్యింది. పార్టీ కార్యకర్తలు మరియు కింది స్థాయి నాయకులకు గాను సాయం చేసేందుకు గాను భీమాను ఏర్పాటు చేస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ ప్రకటించాడు.
జనసైనికుల భీమా కోసం తన వంతుగా కోటి రూపాయల వ్యక్తిగత డబ్బును ఇస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. పార్టీ ఇతర నాయకులు కూడా తమకు తోచినంత సాయంను చేయాలని పవన్ పిలుపునిచ్చాడు. భీమా ను చెల్లించడం ద్వారా జనసైనికులు ఏమైనా జరిగినా కూడా వారి కుటుంబాలకు పార్టీ తరపు నుండి భీమా అందుతుంది. ఈ పద్దతిని పవన్ కళ్యాణ్ ప్రోత్సహిస్తూ ఏకంగా కోటి రూపాయలను విరాళంగా ఇవ్వడం అభినందనీయం. ఆయన మంచి మనసుకు ఇది నిదర్శణం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Recent Random Post: