షాకింగ్: హుజూరాబాద్ కాంగ్రెస్ నేత ఆడియో లీక్..! టీపీసీసీ నోటీసులు

ఓపక్క హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రకటన రాకముందే టీఆర్ఎస్-బీజేపీ మధ్య రాజకీయాలు హీటెక్కాయి. ఇప్పుడు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కౌశిక్ రెడ్డి ఫోన్ సంభాషణ దానిపై అగ్గి రాజేస్తోంది. కాంగ్రెస్ నేత అయిన కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనకు టీఆర్ఎస్ టికెట్ కన్ఫర్మ్ అయిందంటూ ఉన్న ఆడియో టేప్ లీకై సంచలనం రేపుతోంది. దీంతో కాంగ్రెస్ సీరియస్ అయి ఆయనకు షోకాజ్ నోటీస్ కూడా జారీ చేసింది.

‘టీఆర్ఎస్ టికెట్ నాకే కన్ఫర్మ్ అయింది. యూత్ అందరినీ పార్టీలోకి గుంజి. ఏం కావాలన్నా నేను చూసుకుంటాను. వారికి 2-3 వేలు ఇద్దాం’ అని కౌశిక్ రెడ్డి చెప్తున్న ఆడియో టేప్ రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఆడియో కొత్త చర్చకు దారి తీసింది. కాంగ్రెస్ లోనే ఉంటూ రాజీనామా చేయకుండా టీఆర్ఎస్ టికెట్ తనదేనంటూ వ్యాఖ్యానించడం కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో టీఆర్ఎస్ ఈటల రాజేందర్ పై గట్టి ఫోకస్సే పెట్టిందని అంటున్నారు.

గతంలోనే కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై అనేక వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. టీఆర్ఎస్ నేతలతో సన్నిహితంగా ఉంటున్నట్టు కూడా వార్తలు గుప్పుమన్నాయి. అయితే.. ఎక్కడా ఈ విషయాలు బహిరంగం కాలేదు. ఇప్పుడు ఏకంగా ఆయన వాయిస్ తో తాను టీఆర్ఎస్ నుంచి హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు.. టికెట్ కన్ఫర్మ్ అయినట్టు.. యూత్ మొత్తాన్ని ఎంత ఖర్చైనా తమవైపుకు తిప్పుకోవాలని సూచిస్తూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ చాలా సీరియస్ అయింది.

గతంలోనే కౌశిక్ రెడ్డిపై వచ్చిన వార్తల నేపథ్యంలో టీకాంగ్రెస్ క్రమశిక్షణా సంఘం హెచ్చరించింది. ఇప్పుడు 24 గంటల్లో ఈ అంశంపై వివరణ ఇవ్వాలని అల్టిమేటం జారీ చేసింది. లేదంటే.. చర్యలు తప్పవని హెచ్చరించింది. మరి.. దీనిపై కౌశిక్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. ఉత్తమ్ కు కౌశిక్ సమీప బంధువు.


Recent Random Post: