శౌర్య ఆయనతో కాస్త జాగ్రత్త అంటూ రానా హెచ్చరిక

నాగశౌర్య తాజాగా సోషల్‌ మీడియాలో బ్రహ్మాజీతో ఉన్న ఫొటో ను షేర్‌ చేసి తమ్ముడు ఇండస్ట్రీలో కొత్తగా అడుగు పెట్టబోతున్నాడు. మీ అందరి సపోర్ట్ కావాలంటూ సరదాగా పోస్ట్‌ పెట్టాడు. అందులో బ్రహ్మాజీ చాలా యంగ్‌ గా కనిపిస్తున్నాడు. పైగా చాలా అమాయకంగా కూడా ఫేస్ పెట్టాడు. దాంతో ఆ ఫొటో మరియు పోస్ట్ చాలా వైరల్‌ అయ్యింది. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్‌ అయిన ఆ ఫొటో కు రానా స్పందించాడు. రానా కూడా చాలా ఫన్నీగా స్పందిస్తూ నాగ శౌర్యకు వార్నింగ్ ఇచ్చినట్లుగా కామెంట్‌ పెట్టాడు.

రానా ట్విట్టర్‌ లో.. వామ్మో ఇదేంటి గురూ నాగశౌర్య దయచేసి నువ్వు జాగ్రత్తగా ఉండు. బ్రహ్మాజీ చూపు నాకు ఎందుకో తేడాగా అనిపిస్తుంది. నువ్వు ఏమంటావ్‌ అంటూ ప్రశ్నించగా నాగశౌర్య సమాధానం.. నువ్వు చెప్పింది కరెక్ట్ భయ్యా. నాకు ఏదో తేడాగానే అనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండాల్సిందే అంటూ మరింత ఫన్‌ ను జోడించి కామెంట్స్ చేశాడు. మొత్తానికి నాగశౌర్య మరియు బ్రహ్మాజీ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవ్వడంతో పాటు ఇలా ఫన్నీ మీమ్స్ చాలా చాలానే ఉన్నాయి. బ్రహ్మాజీ కూడా ఈ ఫొటోకు తనదైన శైలిలో కామెడీని యాడ్‌ చేశౄడు.


Recent Random Post: