నా శరీరంలో వచ్చిన మార్పులకు అసహ్యంగా కామెంట్స్ చేశారు

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్‌ అందంగా ఉంటే మాత్రమే అవకాశాలు దక్కుతాయి. మొహంపై మచ్చలు వచ్చినా కాస్త బొద్దుగా అయినా కూడా వెంటనే వారికి ఇండస్ట్రీలో చీదరింపులు.. సోషల్‌ మీడియాలో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈమద్య కాలంలో ట్యాక్సీవాలా హీరోయిన్‌ ప్రియాంక జవాల్కర్‌ కు కూడా అదే అనుభవం ఎదురయ్యింది. ఆమెను అత్యంత దారుణంగా కొందరు కామెంట్స్ చేశారట. కాని ఇండస్ట్రీలో మాత్రం ఆమెకు పాజిటివ్ గానే రెస్పాన్స్ వచ్చిందని తాజాగా ఎమోషనల్‌ అయ్యింది.

ఆమె నటించిన తిమ్మరుసు కు పాజిటివ్‌ రెస్పాన్స్ వచ్చింది. సినిమా సక్సెస్ మీట్‌ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. లాక్ డౌన్‌ సమయంలో అనారోగ్య కారణాల వల్ల కాస్త లావు అయ్యాను. ఆ సమయంలో నన్ను చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేశారు. కొందరు అత్యంత అసహ్యంగా కూడా కామెంట్‌ చేశారు. తిమ్మరుసు సినిమా యూనిట్‌ మాత్రం మీరు ఎలా ఉన్నా పర్వాలేదు.. మోడల్ కాదు మాకు నటి కావాలంటూ తీసుకున్నారు అని వారికి థ్యాంక్స్ చెప్పింది. నా శరీరంలో వచ్చిన మార్పులకు నాది తప్పు కాకున్నా కూడా విమర్శలు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.


Recent Random Post: