పోలీసులను ఆశ్రయించిన ప్రముఖ యాంకర్‌

నటిగా.. యాంకర్‌ గా సుదీర్ఘ కాలంగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం అయిన భార్గవి ఫేస్‌ బుక్‌ అకౌంట్‌ హ్యాక్ అయ్యింది. ఈమద్య కాలంలో సెలబ్రెటీల సోషల్‌ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవ్వడం చాలా కామన్‌ విషయంగా మారింది. అయితే భార్గవి అకౌంట్‌ ను హ్యాక్ చేసిన వారు ఆమె పేరుతో మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా పోస్ట్ లు పెట్టారు. దాంతో ఆమె వెంటనే పోలీసులను ఆశ్రయించింది.

తన అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. అందులో మత విద్వేషాలు కలిగించే పోస్ట్‌ లు పెడుతున్నారు.. వాటితో నాకు సంబంధం లేదు. దయచేసి వాటిని ఎవరు షేర్‌ చేయడం కాని పట్టించుకోవడం కాని చేయవద్దని విజ్ఞప్తి చేసింది. సోషల్‌ మీడియాలో ఉన్న ప్రముఖులు చాలా జాగ్రత్తగా ఉండాలని ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు తెలియజేశారు. భార్గవి అకౌంట్‌ ను వెంటనే రికవరీ చేసేందుకు గాను ఫేస్‌ బుక్‌ అధికారులతో చర్చలు జరిపినట్లుగా కూడా తెలుస్తోంది.


Recent Random Post: