మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ కు యూఏఈ ప్రభుత్వం నుంచి ఒకేసారి అరుదైన గౌరవం దక్కింది. వారిద్దరికీ 10 ఏళ్ల కాలపరిమితితో కూడిన గోల్డెన్ వీసాలను అబుధాబి ఆర్ధిక అభివృద్ధి విభాగం ఛైర్మన్ మహ్మద్ అలీ అల్ షోర్ఫా అల్ హమ్మది అందించారు. ఇద్దరు సూపర్ స్టార్స్ కు కూడా ఇది తొలి గోల్డెన్ వీసా కావడం విశేషం.
మళయాళ సినిమాకు మమ్ముట్టి, మోహన్‌లాల్ చేసిన కృషిని మహ్మద్ ఆలీ కొనియాడారు. ఇది మొత్తం మళయాళ ఇండస్ట్రీకి దక్కిన గౌరవమని మమ్ముట్టి, మోహన్ లాల్ అన్నారు. వీరిద్దరి కంటే ముందు భారతీయ సినీ పరిశ్రమ నుంచి షారూఖ్ ఖాన్, సంజయ్ దత్ యూఏఈ గోల్డెన్ వీసా అందుకున్న వారిలో ఉన్నారు. వీరే కాకుండా వివిధ విభాగాల్లో తమ దేశాభివృద్ధికి విశేష కృషి చేసిన విదేశీయులకు 2019 నుంచి యూఏఈ 5, 10 ఏళ్ల గోల్డెన్ వీసాలు ఇస్తోంది.
Recent Random Post: