70లక్షల చీటింగ్ కేసులో హీరో ఆర్యకు ఉపశమనం!

తమిళ నటుడు ఆర్యపై శ్రీలంకకు చెందిన విద్జా అనే మహిళ 70 లక్షలు తీసుకుని తప్పించుకుంటున్నారని చీటింగ్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. కేసు విచారణ విషయంలో చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆర్యను విచారించడానికి లీగల్ నోటీసులు ఇష్యూ చేసారు. అనంతరం రూల్ ప్రకారం ఆర్య పోలీసుల ముందు హాజరై విచారణకు సహకరించారు. ఆర్యని కొన్ని గంటల పాటు విచారించిన అనంతరం పోలీసులు దీన్ని చీటింగ్ కేసుగా కన్ క్లూజన్ కి వచ్చారు. ఆర్యని ఇరికించేందుకు మరో చీటర్స్ బృందం చేసిన పనిగా పోలీసులు తెలుసుకున్నారు.

దీంతో పోలీసులు ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించడంతో అసలు మోసగాళ్లు ఎవరో దొరికారు. చెన్నైలోని పులియంతోపకు చెందిన మహమ్మద్ ఆర్మాన్.. మహ్మాద్ హుస్సేనీ అనే ఇద్దరు వ్యక్తులు ఆర్య పేరుతో వాట్సాప్ లో మోసానికి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆర్య పేరుతో శ్రీలంక మహిళ విద్జాతో చాటింగ్ లు చేసి…స్నేహం పెంచుకుని డబ్బులు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆర్య నిర్ధోషి అని ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని చెన్నై పోలీసులు నిర్ధారించారు. అరెస్ట్ అయిన దోషులిద్దరిపై చీటింగ్ కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్య పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. నిజమైన దొంగలను పట్టుకున్నందుకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు ధన్యవాదాలు. ఈ ఆరోపణ నా మనసుని గాయపరిచింది. ఇప్పుడెంతో ఉపశమనం దక్కింది. నా మీద నమ్మకం ఉంచిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు అని ట్వీట్ చేసారు. ప్రస్తుతం ఆర్య `ఆరణ్మనై-3`లో నటిస్తున్నారు. ఇందులో ఆండ్రియో జరోమియా- రాశీఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.


Recent Random Post: