యువ సామ్రాట్ నాగ చైతన్య – సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ”లవ్ స్టోరీ”. ఏప్రిల్ లోనే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ చిత్రం కరోనా నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా వినాయక చవితి సంధర్భంగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే అదే రోజు మరికొన్ని క్రేజీ మూవీస్ రిలీజ్ అవుతుండటంతో ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని మరోసారి పోస్ట్ పోస్ట్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో ‘లవ్ స్టోరీ’ సినిమా షూటింగ్ మళ్ళీ ప్రారంభించినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. రిలీజ్ కు ఇంకాస్త సమయం దొరకడంతో శేఖర్ కమ్ముల సినిమాలోని కొన్ని సన్నివేశాలను బెటర్ మెంట్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఈ ప్యాచ్ వర్క్ షూటింగ్ ని వీలైనంత త్వరగా ఫినిష్ చేయనున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ముల సీన్స్ పర్ఫెక్ట్ గా రావడం కోసం గతంలో కూడా తన సినిమాల్లో రీ షూట్స్ చేసిన సంగతి తెలిసిందే.
ఇకపోతే ‘లవ్ స్టోరీ’ చిత్రాన్ని సెప్టెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది. దీనిపై చిత్ర యూనిట్ రాబోయే రోజుల్లో క్లారిటీ ఇస్తుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయ్యే ఫస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ఇదే అవుతుంది. ఈ సినిమాపై సినీ అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వదిలిన ప్రచార చిత్రాలు – పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి.
సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ – అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ‘లవ్ స్టొరీ’ చిత్రాన్ని నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ – పి. రామ్మోహన్ రావు నిర్మాతలు. ఈ చిత్రానికి పవన్ సి.హెచ్ సంగీతం సమకూర్చారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ.. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల – ఈశ్వరీ రావు – దేవయాని తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.
Recent Random Post: