ఉస్తాద్ రామ్ పోతినేని, బోయపాటి శ్రీను గత కొంత కాలంగా కలిసి సినిమా చేద్దామని అనుకుంటున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో ప్రాజెక్ట్ విషయమై ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బోయపాటి నరేట్ చేసిన స్క్రిప్ట్ ను రీసెంట్ గా రామ్ ఓకే చేసినట్లుగా తెలుస్తోంది.
కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా బోయపాటి ఈ స్క్రిప్ట్ ను డిజైన్ చేసాడట. ప్రస్తుతం రామ్ లింగుసామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరోవైపు బోయపాటి అఖండ షూటింగ్ ను పూర్తి చేసాడు. పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు జరుగుతున్నాయి. దసరాకు రిలీజ్ అనుకున్నా కానీ అది జరిగే అవకాశాలు కనిపించట్లేదు.
ఈ కమిట్మెంట్స్ పూర్తయ్యాక రామ్, బోయపాటి కాంబినేషన్ లో సినిమా మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
Recent Random Post: