‘మా’ ఎన్నికల్లో విష్ణు బాబుకు నా మద్దతు

మా ఎన్నికల్లో పోటీ చేసేది ఎవరు.. ఎవరి ప్యానల్‌ ఏంటీ అనే విషయంలో స్పష్టత వచ్చేసింది. చాలా మంది చాలా రకాలుగా ఎన్నికల గురించి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్‌ విషయంలో కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది. వచ్చే నెలలో జరుగబోతున్న ఎన్నికల కోసం మా అంతా సిద్దం అయ్యింది. ఈ సమయంలో మా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. ఒకొక్కరు చొప్పున తమ మద్దతు ఎవరికి అనే విషయాన్ని చెప్పేస్తున్నారు. తాజాగా పృథ్వీ తన మద్దతును మంచు విష్ణుకు అంటూ తేల్చి చెప్పాడు.

మంచు విష్ణు సైలెంట్ గా తన పని తాను చేసుకు వెళ్తున్నాడు. ఖచ్చితంగా ఒక మంచి పరిపాలన అందిస్తాడు అనే నమ్మకం ఉంది. అన్ని విషయాల్లో కూడా ఆయనకు స్పష్టత ఉంది. తన తండ్రి మోహన్ బాబు సహకారంతో మా ను సక్రమంగా ముందుకు నడిపిస్తాడు.. మా లో ఉన్న సమస్యలు పేద కళా కారులకు సంబంధించిన విషయాలను కూడా విష్ణు బాబు సక్రమంగా నిర్వహిస్తాడు అనే నమ్మకం నాకు ఉంది. ప్రత్యర్థి ప్యానల్‌ వారు విభేదాల కారణంగా మా గౌరవం తగ్గుతుంది. ఇప్పటి వరకు చేసిన అధ్యక్షులు అంతా కూడా బాగా చేశారు. వారి దారిలోనే మంచు విష్ణు బాబు కూడా తప్పకుండా మా గౌరవం నిలబెడుతాడు అంటూ విశ్వాసం వ్యక్తం చేస్తూ పథ్వీ తన మద్దతును విష్ణుకు ప్రకటించాడు.


Recent Random Post: