కారుణ్య నియామకాలపై సీఎం జగన్ సంచలన నిర్ణయం..!

కోవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని సీఎం జగన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. నవంబర్ 30 నాటికి అ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం అన్నారు. వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణం, విలేజ్ అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు, రాష్ట్రంలో కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్, ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది నియామకంపై సీఎం సీమీక్షించారు.

ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ క్యాలెండర్ రూపొందించామని.. ఈనెల 20న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని సీఎం అన్నారు. రాష్ట్రంలో కొత్తగా 176 కొత్త పీహెచ్ సీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అన్నారు. జనవరిలో పనులు ప్రారంభించి 9 నెలల్లో పనులు పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు హాజరయ్యారు.


Recent Random Post: