మొదట గుండె పోటు వచ్చింది.. ఆ తర్వాత గొడ్డలితో అతి కిరాతకంగా తనను తానే నరుక్కుని చచ్చిపోయాడో పెద్దాయన.! కాన్సెప్ట్ అదిరిపోయింది కదూ.! బాత్రూమ్‌లో బాబాయ్ కథ ముగిసిపోయిన వైనాన్ని రాజకీయంగా ఎలా వాడేసుకున్నారో అప్పట్లో అంతా కళ్ళారా చూశాం. నువ్వే చంపించావ్.. కాదు నువ్వే చంపించావ్.. అంటూ టీడీపీ, వైసీపీ ఒకరి మీద ఒకరు నిందలేసుకున్నారు. ఆ తర్వాత వ్యవహారం ఎన్నెన్నో మలుపులు తిరిగీ తిరిగీ.. ఆ కేసు ఇంకా ఓ కొలిక్కి రాలేదాయె.
తాజాగా, టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు దాడులకు దిగాయ్. ‘మా ముఖ్యమంత్రిని విమర్శిస్తే మేం ఊరుకుంటామా.? సమాధానం ఇలాగే వుంటుంది..’ అంటూ ఓ వైపు వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఇంకో వైపు హోం మంత్రి మేకతోటి సుచరిత మాత్రం, ‘చంద్రబాబే ఈ కుట్రకు ప్లాన్ చేశారనేది మా అనుమానం. టీడీపీ కార్యకర్తలే తమ కార్యాలయాలపై దాడులు చేసుకుని.. ఆ నేరాన్ని వైసీపీ కార్యకర్తల మీదకు నెట్టేస్తున్నారు..’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయం అదిరిపోయింది. గతంలో పట్టాభి ఇంటిపై జరిగిన దాడిని కూడా ఇలాగే అభివర్ణించింది అధికార వైసీపీ. టీడీపీలోని రెండు గ్రూపుల మధ్య గొడవలో భాగంగా పట్టాభి ఇంటిపై టీడీపీ శ్రేణులే దాడి చేశాయన్నది వైసీపీ ఆరోపణ. అదే నిజమైతే, నేరస్తుల్ని అరెస్టు చేసి, లోపలెయ్యొచ్చు కదా.? అరెస్టయ్యేది టీడీపీ కార్యకర్తలే అయినప్పుడు అది వైసీపీకి పొలిటికల్ మైలేజీ తెస్తుంది కదా.?
టీడీపీ కార్యాలయంపై తాజా దాడుల వ్యవహారంలోనూ టీడీపీ కార్యకర్తల పాత్రను వైసీపీ ప్రభుత్వం బయటపెట్టాలి కదా.? అంత చిత్తశుద్ధి వైసీపీ ప్రభుత్వానికి వుంటుందని ఎలా అనుకోగలం.? బూతులు తిడితే దాడులు చేస్తారట.?
వైసీపీలో ఏకంగా బూతుల కోసం ఓ శాఖను ఏర్పాటు చేసి, నిత్యం కొందరు నేతలతో రాజకీయ ప్రత్యర్థుల్ని, కొన్ని కులాల్నీ బూతులు తిట్టిస్తున్న వైనాన్ని ఎలా మర్చిపోగలం.? వాళ్ళవైతే స్తోత్రాలు ఇంకెవరివైనా అయితే బూతులా.? ఇందుకే కదా, వైఎస్సార్సీపీ టెర్రరిజం.. అనే పదాలు సోషల్ మీడియాలో కొత్తగా పుట్టుకొస్తున్నాయ్.
Recent Random Post: