దుబాయ్ లో పుష్ప భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తోన్న సుక్కూ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా రేంజ్ చిత్రంగా పుష్పను చేస్తోన్న విషయం తెల్సిందే. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ ప్రాజెక్ట్ లో మొదటి భాగం పుష్ప ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది. ఇప్పటికే పుష్ప ప్రమోషన్స్ జోరుగా సౌగుతున్నాయి.

డిజిటల్ ప్రమోషన్స్ మాత్రమే కాకుండా పుష్ప విషయంలో భారీ ప్రమోషన్స్ ను చేపట్టనున్నారట. వివిధ సిటీలలో పుష్ప ఈవెంట్ ను నిర్వహిస్తారని తెలుస్తోంది. హిందీ థియేట్రికల్ రిలీజ్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్ కూడా తొలగిపోయిందట. పుష్ప ది రైజ్ హిందీలో కూడా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే పుష్ప ప్రమోషనల్ ఈవెంట్ ను దుబాయ్ లో కూడా నిర్వహించాలని భావిస్తున్నారు నిర్మాతలు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పరిశీలించాలని ఫిక్స్ అయ్యారట. సుకుమార్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది.


Recent Random Post: