బిగ్ బాస్ 5: సిరిని టార్చర్ పెడుతోన్న షణ్ముఖ్?!

ఈ వారం కెప్టెన్సీ టాస్క్ బిగ్ బాస్ లో మొదలైంది. ఇందులో భాగంగా బిగ్ బాస్ హౌజ్ లో గోల్డ్ మైనింగ్ జరుగుతుంది. సందర్భానుసారం టాస్క్ మధ్యలో బజర్ మోగుతుంది. అలా మోగినప్పుడు ఇంట్లో ఉంచిన నాలుగు గోల్డ్ మైనింగ్ కు సంబంధించిన హ్యాట్స్ ను దక్కించుకోవాలి. హ్యాట్స్ దక్కించుకున్న నలుగురు కంటెస్టెంట్స్ మైనింగ్ చేయాలి. మైనింగ్ ఏరియాలో గోల్డ్ బాల్స్ లాంటివి ఉంచారు. బజర్ ఎండ్ లోపు ఎన్నైనా కలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత చేసినవి సేఫ్ లో దాచుకోవాలి. అలాగే మధ్యలో పవర్ హౌజ్ థండర్ సౌండ్ కూడా వినిపిస్తుంది. మొదట యాక్సిస్ సంపాదించిన వారికి పవర్ టూల్ లభించే అవకాశం ఉంటుంది. ఈ పవర్ టూల్ దక్కించుకోవాలంటే కొన్ని గోల్డ్ బాల్స్ వదులుకోవాలి.

ముందుగా బజర్ మోగినప్పుడు షణ్ముఖ్, సిరి, రవి, సన్నీలు హ్యాట్స్ దక్కించుకుని గోల్డ్ ను డిగ్ చేసారు. రెండోసారి ఆ అవకాశం సన్నీ, మానస్, ప్రియాంక, ఎన్నీ మాస్టర్ లకు దక్కింది. మూడో సారి ఈ ఛాన్స్ కాజల్, మానస్, ప్రియాంక, ఎన్నీ మాస్టర్ లకు వచ్చింది. దీంతో పాటు మానస్ కు పవర్ యాక్సిస్ రాగా పవర్ టూల్ అయిన గొడ్డలి దక్కించుకోవడానికి 25 బాల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది సన్నీకి ఇస్తున్నట్లు మానస్ చెప్పాడు. సో సన్నీవి 25 కాయిన్స్ తిరిగి ఇచ్చేయాల్సి వచ్చింది.

టాస్క్ సంగతి పక్కన పెడితే ఈ ఎపిసోడ్ లో అందరికీ చిరాకు తెప్పించింది అంటే షణ్ముఖ్ – సిరిల ఎపిసోడ్. ఇద్దరి మధ్యా ఏం జరిగిందో కరెక్ట్ గా ప్రొజెక్ట్ కాలేదు కానీ ఇద్దరి మధ్య గొడవ అయితే అయింది. మొదటి నుండి షణ్ముఖ్, సిరి క్లోజ్ గా ఉంటూ వస్తున్నారు. సడెన్ గా ఇప్పుడు మన రిలేషన్ ఎలా ప్రొజెక్ట్ అవుతుందో అన్న ఆలోచన షణ్ముఖ్ కు రావడం, రాత్రి ఇద్దరం వేరే బెడ్స్ లో పడుకుందాం అని చెప్పడం ఏంటో అర్ధం కాలేదు.

అలాగే షణ్ముఖ్ దగ్గర వేరే వాళ్ళను పొగిడినా కూడా తను తీసుకోలేకపోతున్నాడు. వేరే వాళ్ళు కామెడీ చేస్తుంటే సిరి నవ్వినా కూడా తప్పు అవుతోంది. అలా చేసినందుకు సిరితో మాట్లాడాలని లేదని, తనకి ఒంటరిగా ఉండాలని ఉందని, నువ్వు లేకపోయినా నాకు ఫరక్ పడదు అని చెప్పడంతో సిరి బాత్ రూమ్ లోకి వెళ్లి తన గోడకు కొట్టుకుంది. మళ్ళీ వచ్చి షణ్ముఖ్ సారీ చెప్పడం. చివరికి ఇద్దరూ కలిశారు. ఓ వైపు గేమ్ జరుగుతుంటే ఇద్దరూ ఈ గొడవతో గేమ్ మీద దృష్టి పెట్టలేకపోయారు.


Recent Random Post: