అనుష్పాల పెళ్లిలో చెర్రోపాసనం

ఉపాసన సోదరి అనుష్పాల పెళ్లి సందడి గురించి తెలిసిందే. అర్మాన్ ఇబ్రహీమ్ ని అనుష్పాల పెళ్లి చేసుకున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి. ఇంతకుముందే సంగీత్ సహా ప్రీవెడ్డింగ్ వేడుక నుంచి కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి. ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ జోసెఫ్ రాధిక్ ఫోటోగ్రఫీ నుంచి అద్భుతమైన స్టిల్స్ వైరల్ అయ్యాయి. ఉపాసన వాటిలో కొన్నింటిని తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంది.

ఈ పెళ్లిలో రామ్ చరణ్- ఉపాసన ఎంతో సందడిగా కనిపించారు. ట్రెడిషనల్ వెడ్డింగ్ కుర్తా లుక్ తో చరణ్ .. లెహెంగా లుక్ లో ఉపాసన కనిపించారు. చరణ్ చాలా సింపుల్ గోల్డ్ కలర్ కుర్తా ధరించగా.. ఉపాసన మెడలో ముత్యాల హారం.. చెవులకు భారీ జూకాలు ప్రత్యేక ఆకర్షణగా కనిపించాయి. ఆ ఇద్దరు గాగుల్స్ ధరించి పెళ్లి వేదికకు జెంటిల్మన్ తరహాలో ప్రత్యేక శోభను తెచ్చారనే చెప్పాలి.

ప్రస్తుతం ఈ ప్రత్యేక ఫోటోలు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. రామ్ చరణ్ పెళ్లి మండపానికి నడుచుకుంటూ వస్తుంటే తనకంటే ముందే ఉపాసన కనిపించారు. ఈ వివాహానికి సెలబ్రిటీ అతిథుల జాబితా పెద్దదే ఉంది. బడ్జెట్ కూడా పెద్ద రేంజులోనే ఖర్చయిందని తెలిసింది. ఇక అటు బాలీవుడ్ అందాల కథానాయిక కత్రిన కైఫ్-విక్కీ కౌశల్ నేడు పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. ఇది పూర్తి సెక్యూరిటీ నడుమ ఎలాంటి ఫోటో లీక్ లేకుండా జరుగుతోంది. ఈ పెళ్లి వేడుక విజువల్స్ కి సంబంధించిన హక్కులను 100కోట్లకు ఓటీటీకి అమ్మేశారన్న గుసగుస వినిపిస్తోంది.


Recent Random Post: