వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆ స్థాయి విభేదాలున్నాయా.?

కుటుంబం అన్నాక చిన్న చిన్న మనస్పర్ధలు మామూలే. అలాగే, వైఎస్ జగన్ కుటుంబంలోనూ చిన్న చిన్న మనసర్థలు వుండి వుండొచ్చుగాక. కానీ, అది అన్నా చెల్లెళ్ళ మధ్య తీవ్రస్థాయి విభేదాల తరహాలో వుంటాయనీ, అవి రాజకీయ వైరాలుగా మారుతాయనీ, ఒకర్ని ఒకరు దెబ్బ తీసుకుంటారనీ ఎవరైనా ఊహిస్తే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా, వైఎస్ జగన్ కుటుంబంలో ఆయనే పవర్ సెంటర్.. అది రాజకీయంగా కావొచ్చు, ఆర్థికంగా కావొచ్చు. సొంత పార్టీని తెలంగాణలో స్థాపించేసి, రాజకీయంగా ఎదిగేసి.. అన్న వైఎస జగన్ మోహన్ రెడ్డిని సోదరి షర్మిల సవాల్ చేయగలుగుతారా.? ఛాన్సే లేదు.

జగన్ ప్రభుత్వంలో ఆమె ఏదైనా పదవిని ఆశించి వుండొచ్చు.. లేదంటే, వైఎస్సార్సీపీలో ఆమె ఏదన్నా పదవి ఆశించి వుండొచ్చు.. కారణాలు ఏవైతేనేం, ఆమె ఆశించింది అక్కడ దొరికి వుండకపోవచ్చు. అన్నమీద చిన్నపాటి అలకతో ఆమె రాజకీయ పార్టీని స్థాపించి వుండొచ్చు.

షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి రోజులు, నెలలు గడిచాయి కానీ, ఎవరూ ఆమె పార్టీని గుర్తించడంలేదు. ఇకపైనా గుర్తించే పరిస్థితి వుండదు. తెలంగాణలోని వైసీపీ మద్దతుదారులే, షర్మిల పార్టీ వైపు చూడటంలేదాయె. ఇవన్నీ నాణానికి ఓ వైపు మాత్రమే.

తెరవెనుకాల కథ నడుపుతున్నది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఇందులో ఇంకో మాటకు తావు లేదు. నేరుగా వైసీపీ తరఫున తెలంగాణలో ప్రస్తుతం రాజకీయ కార్యకలాపాలు నిర్వహించలేరు గనుక, వైఎస్సార్ పేరు తెలంగాణ జనంలో వినిపిస్తూ వుండాలంటే.. దానికి సరైన మార్గం కొత్త పార్టీ.. అది కూడా షర్మిల ద్వారా.. అనే ఆలోచించి వుండొచ్చు.

తెలంగాణలో కొత్త కుంపటి సరిగ్గా వర్కవుట్ కాకపోవడంతో, తిరిగి షర్మిల ఏపీ వైపు చూస్తారనీ, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాజకీయంగా దెబ్బ అవుతుందనీ.. పచ్చ విశ్లేషణలు వినిపిస్తూ వుంటే, జనానికి నవ్వాలో ఏడవాలో అర్థం కావడంలేదు.


Recent Random Post: