సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో చిత్రం అంటే దానికి ఉండే హైప్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన అతడు, ఖలేజా కల్ట్ హిట్స్ గా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరి నుండి వస్తోన్న మూడో చిత్రం కాబట్టి అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి.
తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ముహూర్తం కుదిరింది. వచ్చే నెల 3న ఈ సినిమాను అధికారికంగా లాంచ్ చేయనున్నారు. మార్చ్ నాలుగో వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెడతారని సమాచారం. అప్పటికి మహేష్ సర్కారు వారి పాటను పూర్తి చేస్తాడట. దాని తర్వాత బ్రేక్ తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమా షూటింగ్ కు షిఫ్ట్ అవుతాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధా కృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. ఎస్ ఎస్ థమన్ సంగీత దర్శకుడు.
Recent Random Post: