తెలంగాణ జలభాండాగారం.. మల్లన్నసాగర్: సీఎం కేసీఆర్

సిద్ధిపేట తుక్కాపూర్ వద్ద నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును సీఎం కేసీఆర్ నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించడం ఓ చారిత్రక ఘట్టం. ఈ మహా యజ్ఞాన్ని పూర్తి చేసిన ప్రతిఒక్కరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఇది మల్లన్నసాగర్ కాదు.. తెలంగాణ జనహృదయ సాగర్.. తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని జలాలతో అభిషేకించే సాగర్. మల్లన్నసాగర్ ఒక్క సిద్ధిపేట జిల్లాకే కాకుండా హైదరాబాద్ తాగు నీటి సమస్యను తీర్చే గొప్ప ప్రాజెక్టు. ఇది ఒక జల భాండాగారంస’.

‘ఈ ప్రాజెక్టు నిర్మాణంలో 58వేల మంది కార్మికులు పని చేశారు. గోదావరి నీళ్లు తెచ్చి కొమురవెల్లి మల్లన్న పాదాలు కడుగుతామని చెప్పాం అవే జలాలతో అభిషేకం చేయబోతున్నాం. ఎందరు ఎన్ని కేసులు వేసినా ధీటుగా ఎదుర్కొని ముందుకెళ్లాం. సింగూరు ప్రాజెక్టును తలదన్నేలా ఈ ప్రాజెక్టు నిర్మించారు. 20 లక్షల ఎకరాలను కడుపులో పెట్టుకుని కాపాడే ప్రాజెక్టు ఇది’ అని అన్నారు.


Recent Random Post: