సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య కేసులో సిఎం జగన్ పూర్తిగా కూరుకుపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఆన్ లైన్లో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోంది. నాడు వివేకా హత్య నాపై నెట్టి జగన్ రాజకీయ లబ్ధి పొందారని రుజువైంది. జగన్ ను సిబిఐ విచారించాలి. సిఎం చైర్ లో కూర్చునే అర్హత జగన్ కు లేదు. ‘సిబిఐ దర్యాప్తు చేస్తే ఏమవుతుంది..? నాపై 12వ కేసు అవుతుంది’ అని జగన్ వివేకా కుమార్తె సునీతతో వ్యాఖ్యానించడం.. చట్టం అంటే లెక్కలేనితనాన్ని, అహంకారాన్ని తెలియజేస్తోంది’.
‘నాడు గ్యాగ్ అర్డర్ తేవడం నుంచి.. ఇప్పుడు సిబిఐ విచారణను తప్పుపట్టడం వరకూ హత్యలో జగన్ ప్రమేయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జగన్.. ఈ విషయంలో ప్రజలను ఏమార్చలేరు.. బయటకొచ్చి సమాధానం చెప్పాలి. వివేకా హత్యలో ప్రధాన సూత్రధారి ఎవరో ప్రజలకు అర్ధమైంది. సూత్రధారుల్ని బోనులో నిలబెట్టకపోతే పౌరులకు ప్రాణా రక్షణ ఉండదు. వైఎస్ కోటలోనే ఆయన తమ్ముణ్మి హత్యచేయడం అంతఃపుర పెద్ద ప్రోత్సాహం లేకుండా సాధ్యమా..?’ అని ప్రశ్నించారు.
Recent Random Post: