ఉమెన్స్ డే స్పెషల్ : నా సక్సెస్ కి కారణం ఆమెనే

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేడు ఈ సందర్భంగా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీస్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ లని అభిమానులతో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.

తాను విజయవంతమైన మీరోగా నిలబడటానికి సక్సెస్ కావడానికి ప్రధాన కారణం తన సతీమణి సురేఖ అని స్పష్టం చేశారు. తను సినిమాలపై నూటికి నూరు శాతం దృష్టిపెట్టడానికి ప్రధాన కారణం అమెనని ఈ సందర్భంగా తెలియజేశారు.

ప్రతీ కుటుంబంలో మహిళలకు ఎన్నో బాధ్యతలు వుంటాయిని చిన్నతనంలో తన తల్లి ఎంతో కష్టపడేవారని ఈ సందర్భంగా మెగాస్టార్ గుర్తు చేసుకున్నారు. నేటి మహిళలు చంద్ర మండలం ఒలింపిక్స్ స్థాయికి ఎదుగుతున్నారని మహిళా సాధికారత కోసం అంతా కృషిచేయాలన్నారు.

ప్రతి ఇంట్లో అమ్మ సోదరి సాధికారత కోసం పాటుపడాలని స్పష్టం చేశారు. ప్రపంచం గర్వించే స్థాయిలో స్త్రీ శక్తి వుండాలని తెలిపారు. కుటుంబంపై బాధ్యతల తీసుకుంటున్న ప్రతీ మహిళకు నమస్కరిస్తున్నా.

నేను సక్సెస్ ఫుల్ హీరోగా మారడానికి నా భార్య సురేఖనే కారణం. మా కుటుంబ బాధ్యతల్ని సురేఖ తీసుకుంది. ఆమె అండగా నిలవడం వల్లే నేను సినిమాలు ధైర్యంగా చేశాను. ఇంట్లో వారి కోసం సురేఖ ఎప్పుడూ ఆలోచిస్తుంటుంది. కోట్లాది రూపాయల హీమిని అందరికి పంచాలని కోరింది` అని పలు ఆసక్టికర విషయాల్ని వెల్లడించారు మెగాస్టార్ చిరంజీవి.

అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా మెగాస్టార్ తో పాటు సూపర్ స్టార్ మహేష్ నమ్రత హీరో నితిన్ తో పాటు పలువురు ఆసక్తికర పోస్ట్ లని షేర్ చేశారు. `గ్రిట్ దయ అందం..మరియు ప్రకాశం.. దయ మరియు స్థితిస్థాపకతకు …మహిళలందరి మార్పుకు స్ఫూర్తి ఇదిగో అంటూ సితార నమ్రత తల్లి ఇందిరా ఫొటోలని అభిమానులతో పంచుకున్నారు.


Recent Random Post: