హృతిక్ ఇంట మళ్లీ పెళ్లి భాజాలు!

బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ రెండవ పెళ్లికి రెడీ అవుతున్నారా? మళ్లీ హృతిక్ ఇంటి పెళ్లి భాజాలు మ్రోగనున్నాయా? అంటే అవుననే తెలుస్తోంది. బాలీవుడ్ నటి సబా ఆజాద్ -హృతిక్ రోషన్ సహజీవనం చేస్తున్నట్లు ప్రచారంలో ఉన్న సంగతి తెలిసిందే. కొంత కాలంగా ఇద్దరు పీకల్లోతూ ప్రేమలో మునిగి తేలుతున్నారని మీడియా కథనాలు అంతకంతకు వేడెక్కిస్తున్నాయి. ఇద్దరు పబ్లిక్ గా చాలా సందర్భాల్లో దొరికారు. అయితే ఇప్పుడా బంధాన్ని పెళ్లి వరకూ తీసుకెళ్తున్నారు.

త్వరలోనే ఈజంట ఒకటి కాబతోఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వివాహ బంధంతో ఒకటై హృతిక్ మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరు కుటుంబాల అనుమతి తీసుకోవడం కూడా పూర్తయిందిట. హృతిక్ తన కుటుంబ సభ్యులకు స్వయంగా ప్రియురాలిని పరిచయం చేయగా సబా ఆజాద్ అందరికీ నచ్చిందిట. హృతిక్ కూడా సజా ఆజాద్ కుటుంబ సబ్యులకు నచ్చడంతో వివాహానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

ఇక హృతిక్ ఇది రెండవ వివాహం. గతంలో హృతిక్-సుసానే ఖాన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల కాపురం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కలరు. ఆ బాధ్యతల్ని సుసానే ఖాన్ తీసుకుంది. అప్పుడప్పుడు పిల్లల్ని భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని హృతిక్-సుసానే లు స్నేహితులుగా కలుసుకుంటున్నారు. తండ్రి ప్రేమను ఆ రకంగా హృతిక్ పిల్లలకి అందిస్తున్నారు.

సబా ఆజాద్- హృతిక్ మాజీ భార్య సుసానేల మధ్య మంచి రిలేషన్ ఉంది. సుసానేకు పాటలంటే చాలా ఇష్టం. సబా రాసిన లిరిక్స్ను ససానేకు పంపిస్తుంది. ఆమె నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీసుకుంటుంది. హృతిక్ కుమారులు హ్రీహాన్ హ్రీదాన్లకు కూడా సబాపై అభిమానముంది. సబా పిల్లలతోనూ ఎంతో చనువుగా మెలుగుతుంది.

సుస్సాన్నే-హృతిక్-సబా ఆజాద్ చాలాసార్లు కలిసారు. ఆ సమయంలో హృతిక్-సబలు కేవలం స్నేహితులు మాత్రమేనని..ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ లేదని..పెళ్లి చేసుకునే ఆలోచన లేదని మీడియాలో కథనాలు వెలువడ్డాయి. కానీ ఇప్పుడు వాటికి భిన్నంగా ఆ జంట వివాహ బంధంతో ఒకటి అవ్వడం విశేషం.

ఇక హృతిక్ సినిమాల విషయానికి వస్తే ఆయన చివరి సారిగా `వార్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ యాక్షన్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత కరోనా ప్రారంభమవ్వడంతో పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు.

ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో మళ్లీ షూట్ కి రెడీ అవుతున్నారు. సిద్దార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో `ఫైటర్` చిత్రలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఇందులోనూ బాడీ బిల్డర్ గా కనిపించనున్నారు. అందుకోసమే హృతిక్ మళ్లీ కఠోరంగా శ్రమిస్తున్నారు. ఇందులో దీపికా పదుకొణే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే కోలీవుడ్ చిత్రం `విక్రమ వేద` రీమేక్ లో కూడా నటించనున్నారు. మరో హీరోగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు.


Recent Random Post: