రోమ్ వెళితే రోమన్ లా ఉండాలని అంటారు! అందుకు పక్కాగా యాప్ట్ అవుతాడు విజయ్ దేవరకొండ. చాలా మంది సాటి హీరోలతో పోలిస్తే ఈ యంగ్ హీరో మడి కట్టుకుని కూచోడు. స్వేచ్ఛా విహంగంలా ఎగురుతాడు. స్వేచ్ఛను మనసారా ఆస్వాధిస్తాడు. ఆ సంగతి ఇక్కడ ఈ ఫీట్ చూస్తేనే అర్థమవుతోంది.
ప్రస్తుతం లైగర్ చిత్రంలో నటిస్తున్న దేవరకొండ దేశ విదేశాల్లో షూటింగుల కోసం వెళ్లిన సంగతి తెలిసిందే. అలా వెళ్లినప్పుడు విదేశీ లొకేషన్ లో ఏం చేస్తున్నాడో చూసారు కదా! అలా రెడ్ వైన్ సిప్ చేస్తూ.. ప్లేట్ లో వెరైటీల్ని ఆస్వాధిస్తున్నాడు.
ఇంతకీ ఆ రెడ్ వైన్ ఒక్కో గ్లాస్ కాస్ట్ ఎంతో తెలుసా? తెలిస్తే షాక్ తిని గిలగిలలాడతారు. ఒక గ్లాస్ వెళ దాదాపు 500 డాలర్లు ఉంటుందని టాక్. మర్చిపోయాడో ఏమో కానీ ఆ వైన్ గ్లాస్ ఫోటోలో క్యాప్చుర్ అయిపోయింది.
మొత్తానికి దేవరకొండ విలాసాల్ని ఆ రేంజులో ఆస్వాధిస్తున్నారన్నమాట. ఇక విదేశీ షూటింగుల కోసం దేవరకొండకు ఇచ్చే 7 స్టార్ హోటల్ రేంజు ఎలా ఉంటుందో..! ఏమిటో.. ఒక్కో సినిమాకి 10 కోట్లు పారితోషికం అందుకుంటున్నాడు మరి. ఆ మాత్రం చేయకపోతే ఎలా? అంటూ గుసగుసలు అభిమానుల్లో వినిపిస్తున్నాయి.
లైగర్ తో పాన్ ఇండియా స్టార్ డమ్ ని అందుకుంటున్న దేవరకొండ మునుముందు వరుసగా పాన్ ఇండియా సినిమాల్ని లాక్ చేసే వీలుందని అంచనా. ఇప్పటికే అతడు శివ నిర్వాణతో మూవీ కోసం రెడీ అవుతున్నా కానీ పుష్ప 1 తర్వాత బన్నీ ప్లాన్ మార్చుకున్నట్టు ఏమైనా జరుగుతుందని భావిస్తున్నారు.
లైగర్ రిజల్ట్ ని బట్టి అతడి ప్లానింగ్ ఎలా అయినా మారొచ్చు. అయితే తాను ఇచ్చిన కమిట్ మెంట్ కి నిలబడి ఆ సినిమాని ఏదోలా పూర్తి చేస్తాడనడంలో సందేహం లేదు. లైగర్ చిత్రానికి పూరి దర్శకత్వం వహించగా.. అనన్య పాండే నాయికగా నటించింది. ఇందులో బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ నటించారు. ఆగస్టులో మూవీ విడుదల కానుంది.
Recent Random Post: