`జబర్దస్త్` ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రామ్ బుల్లి తెరపై ఎంత పెద్ద సక్సెస్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. అందులో ట్యాలెంటెడ్ కంటెస్టెంట్లు ఓ ఎత్తైతే హోస్ట్ లు నాగబాబు..రోజా లు మరో ఎత్తుగా నిలిచారు. ఇద్దరు హోస్ట్ లుగా కొనసాగినంత కాలం షో సక్సెస్ కి తిరుగులేదు. ప్రేక్షకులకి నవ్వులే నవ్వులు. కంటెస్టెంట్ల ఎంటర్ టైన్ మెంట్ కన్నా హోస్ట్ ల పంచ్ డైలాగులు మరింత హైలైట్ అయ్యేవి.
అయితే అనూహ్యంగా ఆ బాధ్యతల నుంచి అనివార్య కారణాలతో నాగబాబు వైదొలిగారు. దీంతో అతని స్థానంలో గాయకుడు మనో వచ్చి కొంత వరకూ నాగబాబు లేని లోటును భర్తీ చేసారు. రోజాతో కలిసి షోని హోస్ట్ చేసారు. ఇద్దరి కాంబినేషన్ కూడా బాగానే వర్కౌట్ అయింది. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయగలిగింది. అయితే ఇటీవలే రోజా కూడా నిష్ర్కమించిన సంగతి తెలిసిందే.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రోజాకి మంత్రి పదవి ఇవ్వడంతో హోస్ట్ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత రోజా స్థానంలో కొంత కాలం ఆమని..మీనా ఇంద్రజ వచ్చారు. కానీ రోజా లేని లోటు అయితే స్పష్టంగా షో లో కనిపిస్తుంది. రోజా టైమింగ్ ని వాళ్లెవ్వరూ మ్యాచ్ చేయలేకపోయారు. అంతటి ఎనర్జీతో షోనూ నడిపించలేకపోయారు.
యాంకర్లు రష్మి..అనసూయ లాంటి వారితో నడిపించాలని ప్రయత్నించినా పనవ్వలేదు. బుల్లి తెరపై యాంకర్లు పోటీ పడి మరీ గ్లామర్ ఎలివేషన్ కార్యక్రమం పెట్టడంతో ఆడియన్స్ కి బోర్ కొట్టింది. కొత్త యాంకర్ల పోటీ కారణంగా అనసూయ..రష్మీ పెర్పెర్మెన్స్ చప్పగానే అనిపిస్తుంది. దీంతో ఇప్పుడు జడ్జ్ కుర్చీ కీలకంగా మారింది.
రోజా టైమింగ్ ని మ్యాచ్ చేసేలా ఓ హాట్ హీరోయిన్ ని రంగంలోకి దించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా హాట్ భామ శ్రద్దా దాస్ పేరు తెరపైకి వస్తోంది. రోజా లేని లోటును శ్రద్దా దాస్ కొంత వరకూ భర్తీ చేయగలదని నిర్వాహకులు విశ్వషిస్తున్నట్లు సమాచారం. మరి ఈ ప్రచారంలో వాస్తవం ఏంత? అన్నది తెలియాల్సి ఉంది.
Recent Random Post: