ప్రభాస్-లోకేష్ కనగరాజ్ కాంబో: కొత్త సినిమా అప్‌డేట్!

ప్రభాస్ ప్రస్తుతం “రాజాసాబ్”, “ఫౌజీ” సినిమాల్లో నటిస్తున్నాడు. ఆ సినిమాల తర్వాత, “సలార్ 2”, “స్పిరిట్”, “కల్కి 2” వంటి ప్రాజెక్టులలో నటించాల్సి ఉంది. కానీ, ఈ పటే ప్రభాస్ ఇప్పటికే హెంబళే ప్రొడక్షన్స్‌కి మరో సినిమాకు కమిట్‌మెంట్‌ ఇచ్చాడట. ఈ సినిమా ప్రారంభం ఈ ఏడాదిలోనే జరగాలని భావిస్తున్నారు, అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం, ప్రభాస్ హీరోగా హోంబళే ప్రొడక్షన్స్‌లో రూపొందబోయే ఈ చిత్రానికి తమిళ స్టార్‌ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని సంక్రాంతి సందర్భంగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇటీవల ప్రభాస్ “మిర్చి” లుక్‌లో కనిపించి తన అభిమానులను అలరించాడు. ఆ లుక్‌ కు “లోకేష్ కనగరాజ్” సినిమా కోసం కావచ్చు అని ప్రచారం జరుగుతోంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ గతంలో “లియో” సినిమా ప్రారంభం సమయంలో కూడా ఒక వీడియోను విడుదల చేసి అభిమానులను సర్‌ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభాస్ సినిమా ప్రారంభం కూడా ఇదే రీతిలో అనౌన్స్‌మెంట్ వీడియోతో ప్రారంభం కావచ్చు. ఈ విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతానికి, ప్రభాస్, లోకేష్ కనగరాజ్ కాంబోలో రూపొందుతున్న సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండబోతుందని అంచనా వేస్తున్నారు.

ఇప్పటికే, “కూలీ” సినిమాతో రజనీకాంత్‌కి విజయం అందించే పనిలో ఉన్న లోకేష్ కనగరాజ్, ఈ ప్రాజెక్ట్‌తో మరింత పేరు ప్రఖ్యాతి సంపాదించుకున్నారు. ప్రభాస్, లోకేష్ కాంబో సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశం ఉందని లేదా, అనౌన్స్‌మెంట్ వీడియో విడుదల చేస్తారని ప్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న “రాజాసాబ్” సినిమా ఈ ఏడాది మే నెలలో విడుదల చేయబడే అవకాశం ఉంది. “సీతారామం” చిత్ర దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “ఫౌజీ” సినిమా ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. మరో వైపు, “సలార్ 2” షూటింగ్‌ 20 శాతం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది ఆ షూటింగ్ పూర్తయితే, 2026లో విడుదల చేసేందుకు ప్రశాంత్ నీల్ నిర్ణయించారు. అలాగే, ఆయన ఎన్టీఆర్‌తో కూడా కొత్త సినిమా మొదలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు.


Recent Random Post: