తనను ట్రోల్ చేసిన వ్యక్తికి పంచ్ పేలే కౌంటర్ ఇచ్చిన ప్రగతి

క్యారెక్టర్ నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో మరుపురాని పాత్రలతో ఆమె తెలుగు సినిమాల్లో ప్రాచుర్యం పొందింది. అక్క, వదిన, అమ్మ, అత్త వంటి పాత్రలకు ప్రగతి సరిగ్గా సరిపోతుంది అన్న పేరుని తెచ్చుకుంది. అటు ఎమోషనల్ పాత్రలు కానీ, ఇటు ఎంటర్టైనింగ్ పాత్రలు కానీ ఆమెకు కొట్టిన పిండి.

ప్రగతి రీసెంట్ గా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టింది. రోజూ తన ఫిట్నెస్ వీడియోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. రీసెంట్ గా ఒక నెటిజెన్, “అక్కా! ఎందుకె అంత కష్టం, కుస్తీ పోటీలకి ఏమైనా పేరు ఇచ్చావా?”

దీనికి ప్రగతి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. “నీకు ఇలా నెగటివ్ కామెంట్స్ పెట్టి డిమోటివేట్ చేయటం ప్యాషన్ అయితే నాకు ఫిజికల్ ఫిట్నెస్ ప్యాషన్. ఇతరులు ఇష్టపడే విషయాల గురించి కాకుండా నాకు నేనుగా ప్రేమించే విషయాల కోసం జీవిస్తాను” అని ప్రగతి పంచ్ పేల్చారు.


Recent Random Post: