బేబీ బంప్ తో.. కొంటె చూపులతో పవన్ హీరోయిన్ కవ్వింపు

స్టార్ హీరోయిన్స్ ఈ మధ్య సడన్ గా నచ్చిన వారిని పెళ్లి చేసుకుని సెటిలైపోతున్నారు. కెరీర్ పరంగా మాంచి జోజ్ లో వుండగానే పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ చందమామ తన చిరకాల మిత్రుడు లవర్ ని వివాహం చేసుకుని అభిమానులకు షాకిచ్చిన విషయం తెలిసిందే. ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని ఇటీవలే అభిమానులతో పంచుకున్న కాజల్ బేబీ బంప్ ఫొటోలతో నెట్టింట హల్ చల్ చేస్తూ ఫ్యాన్స్ కి నిత్యం టచ్ లో వుంటోంది.

ఇటీవల బేబీ బంప్ తో స్పెషల్ ఫొటో షూట్ లో పాల్గొని ఆ ఫోటోలని అభిమానులతో పంచుకుంది కూడా. ఇప్పటికే చాలా మంది హీరోయిన్ లు బేబీ బంప్ ఫొటో షూట్ లతో సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్ లో హల్ చల్ చేశారు. సమీరా రెడ్డి లాంటి హీరోయిన్ లు అయితే మరింత ముందుకెళ్లి అండర్ బేబీ బంప్ వీడియో షూట్ తో పిచ్చెక్కించారు. తాజాగా పవన్ కల్యాణ్ హీరోయిన్ ప్రణీత కూడా ఈ బ్యాచ్ లో చేరింది. ఇటీవలే నితిన్ అనే ఓ బబినెస్ మేన్ ని వివాహం చేసుకున్న ప్రణీత రెండు రోజుల క్రితమే తాను ప్రెగ్నెంట్ అంటూ శుభవార్త చెప్పేసింది.

ఇందు కోసం ప్రెగ్నెన్సీ కిట్ టెస్ట్ రిజల్ట్ ని ఇందుకు సంబంధించిన ఎక్స్ రే ని కూడా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుని సంబరపడింది. తొలి సారి తల్లి కాబోతున్నానని తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్న తీరు ప్రతీ ఒక్కరినీ ఆకట్టుకుంది. తాజాగా బేబీ బంప్ ని చూపిస్తూ ప్రణీత కవ్విస్తున్న ఫొటోలని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఇంట్లో మిర్రన్ ముందు నించుని బేబీ బంప్ ని చూపిస్తూ కన్ను కొడుతూ ఫొటోలకు పోజులిచ్చిన ఓ ఫొటోని అభిమానులకు షేర్ చేసింది.

అంతే కాకుండా ఈ ఫొటోకు ఆసక్తికరమైన క్యాప్షన్ ని కూడా జత చేసింది. ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్లు ప్రతీ రోజు ఇలా అద్దం ముందు నుంచుని బేబీ బంప్ ని చెక్ చేసుకోవచ్చు అంటూ కొంటెగా క్యాప్షన్ ఇచ్చింది.

ప్రణీత అద్దంముందు నుంచొని కొంటెగా కన్ను గీటుతూ బేబీ బంప్ తో హల్ చల్ చేస్తున్న తాజా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ప్రణీత తన భర్త నితిన్ 34వ బర్త్ డే సందర్భంగా తను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన విషయం తెలిసిందే.

తెలుగు తమిళ కన్నడ హిందీ భాషల్లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ప్రణీత తెలుగులో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో పరిచయం అయింది. ఆ తరువాత సిద్ధార్ధ్ తో ‘బావ’ పవన్ కల్యాణ్ తో అత్తారింటికి దారేది’ ఎన్టీఆర్ తో ‘రభస’ మహేష్ తో ‘బ్రహ్మాత్సవం’ రామ్ తో ‘హలో గురు ప్రేమ కోసమే’ వంటి చిత్రాల్లో నటించింది. కన్నడలో ప్రణీత నటించిన ‘రామణ అవతార’ చిత్రంలో నటించింది. చిత్రీకరణ దశలో వున్న ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.


Recent Random Post: