అఖిల్‌ తో ఉన్న ఈమె గురించి తెలుసా?

ఈ ఫొటోలో అఖిల్‌ తో ఉన్న లేడీ పేరు కైరవి మెహతా. ఈమె ఒక ప్రైవేట్‌ చెఫ్‌. అక్కినేని వారికి అత్యంత సన్నిహితురాలైన ఈ చెఫ్‌ చేతి వంట వల్లే ఆ ఫ్యామిలీ అంతా కూడా చాలా ఆరోగ్యంగా స్ట్రాంగ్‌ గా ఫిట్‌ గా ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల వారు అంటూ ఉంటారు. డైట్‌ అంటే ఇష్టమైన ఆహారంను తినకుండా ఉండాలి, అలాగే రుచికరమైన భోజనంకు దూరంగా ఉండాలి. కాని కైరవి మాత్రం అలా ఏమీ చేయదు. ఇష్టం అయిన ఆహారం పెడుతూనే డైట్‌ ఫాలో అయ్యేలా చేస్తుంది.

లావు పెరిగే పదార్థాలను దూరం పెడుతూ ప్రతి ఒక్కరి వంటలో కూడా డైట్‌ ఫాలోయింగ్‌ కు సంబంధించిన రూల్స్ పాటిస్తూనే రుచికరమైన భోజనం తయారు చేయడం లో ఈమె దిట్ట గా చెబుతున్నారు. నాగార్జున, అమల, అఖిల్‌ మరియు చైతూలకు ఈమె వంట అంటే ప్రత్యేకమైన అభిమానంగా చెబుతున్నారు. సమంతకు కూడా ఈమె అంటే ప్రత్యకమైన ఇష్టంగా చెబుతున్నారు. మొత్తానికి అక్కినేని వారి ఫ్యామిలీని సుదీర్ఘ కాలంగా ఆరోగ్యంగా చూసుకుంటున్న కైరవి మెహత తాజాగా ఇలా అఖిల్‌ తో ఫొటో తీసుకుని సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.


Recent Random Post: