అంజలి గతం గతః అంటోంది

రాజోలు పాప అంజలి తెలుగుతో తమిళ్ లో బాగానే పాపులారిటీ సంపాదించుకుంది. వరసగా రెండు భాషల్లో సినిమాలు చేసిన అంజలి ఆ మధ్య వివాదాల్లో కూడా బానే ఇరుక్కుంది. కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది అంజలి. వారం రోజుల తర్వాత మళ్ళీ ప్రపంచం ముందుకు వచ్చి తన పిన్ని వేధింపులు భరించలేకే ఇలా అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది.

ఇక తమిళ నటుడు జైతో కూడా అంజలి ప్రేమాయణం సాగించింది అప్పట్లో వార్తలు బలంగా వచ్చిన విషయం తెల్సిందే. అప్పట్లో అంజలి ట్విట్టర్ లో వరసగా జై తో ఫోటోలను షేర్ చేయడంతో అందరూ నిజమనే అనుకున్నారు.

కానీ అంజలి ప్రస్తుతం అదంతా గతమని, దాన్ని వదిలేసానని అంటోంది. తాను ప్రస్తుతం సింగిల్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాల మీదే ఉందని చెబుతోంది.


Recent Random Post: