బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెల్సిందే. ఆయన అరెస్ట్ అయిన సమయంలో డ్రగ్స్ తీసుకోలేదు. అలాగే ఆయన వద్ద డ్రగ్స్ ఉన్నట్లుగా కూడా నిరూపితం కాలేదు. కాని ఎన్ సీ బీ అధికారుల ఎంక్వౌరీలో ఆర్యన్ కు డ్రగ్స్ అలవాటు ఉంది. అలాగే ఎంతో మంది డ్రగ్స్ స్మగ్లర్లతో ప్రత్యక్ష సంబంధం ఉంది. దాంతో ఆర్యన్ కు బెయిల్ రావడం లేదు. పలు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. దాంతో ఆర్యన్ తండ్రి షారుఖ్ కన్నీరు మున్నీరు అవుతున్నాడట.
ఇక ఆర్యన్ అరెస్ట్ అయినప్పటి నుండి కూడా ఇంట్లో స్వీట్లు వండటం బంద్ చేశారట. ఇంట్లో పని వారికి గౌరీ ఖాన్ ఆర్యన్ తిరిగి వచ్చే వరకు ఇంట్లో స్వీట్లు వండవద్దని చెప్పారట. ఇంట్లో గత కొన్ని రోజులుగా చాలా విషాద చాయలు అలుముకున్నాయి. ఎప్పుడు సందడిగా ఉండే ఆ ఇల్లు కాస్త ఇప్పుడు చాలా మూడీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆ ఇల్లు ఆర్యన్ రాక కోసం ఎదురు చూస్తుందని ముంబయి మీడియా వర్గాల వారు అంటున్నారు.
Recent Random Post: