అందాల కథానాయిక అవికా గోర్ పరిచయం అవసరం లేదు. చాలా గ్యాప్ తర్వాత టాలీవుడ్ లో కంబ్యాక్ అవుతున్న ఈ బ్యూటీ నిర్మాతగా తన మొదటి వెంచర్ షూటింగ్ పూర్తి చేసుకుంది. నిర్మాతగా ఉండడం వల్ల మరింత వినయపూర్వకమైన నటిగా మారానని అవిక చెబుతోంది. అవికా గోవాలో తొలి ప్రొడక్షన్ వెంచర్ కోసం షూటింగ్ లో పాల్గొంటోంది. ఇది `అద్భుతమైన అనుభవం` అని సంబరపడుతోంది.
“ఇది నా మొదటి ప్రొడక్షన్ కనుక ఇది అద్భుతమైన అనుభవం. మేం గోవాలో 10 రోజుల పాటు చిత్రీకరణలో పాల్గొన్నాం. మొత్తం లొకేషన్ లో వైబ్ చాలా విభిన్నంగా ఉంది“ అని అవిక తెలిపింది. ఇందులో ఎవరు నటిస్తున్నారు అన్న సమాచారం వెల్లడించలేదు కానీ.. నిర్మాతగా ఉండటం నన్ను మరింత వినయపూర్వకంగా మార్చిందని వెల్లడించింది.
నేను ఒక వ్యక్తిగా ఎదగడానికి ఇది సహాయపడింది. నా గురించి నేను చాలా గర్వపడుతున్నాను. ఈ సినిమాను త్వరగా పూర్తి చేసి విడుదల చేయడానికి వేచి ఉండలేను.. అని తెలిపింది. అవిక తెలుగు భాషా థ్రిల్లర్ డ్రామా `నెట్` లో కనిపించింది. తదుపరి తెలుగులో `థాంక్యూ` చిత్రంలో కనిపించనుంది. మెగాస్టార్ అల్లుడు కళ్యాణ్ దేవ్ సరసన ఓ చిత్రం చేస్తోంది.
Recent Random Post: