ప్రముఖ నిర్మాత కె బాలు ఇక లేరు

Share

సినిమా ప్రపంచం మరో మంచి వ్యక్తిని కోల్పోయింది. ప్రముఖ నిర్మాత కె బాలు ఇక లేరు. కెబి ఫిల్మ్స్ పేరిట తమిళంలో దాదాపు 15 సినిమాలకు పైగా నిర్మించిన కె బాలు అందరినీ విషాదంలో ఉంచి విడిచి వెళ్లిపోయారు.

తన ఆరోగ్యం క్షీణించిన నేపథ్యంలో జనవరి 1న చెన్నై లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేయగా చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కరోనా కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. ఈరోజు ఉదయం చెన్నై బీసెంట్ నగర్ లోని ఈ-సెమెట్రీలో ఆయన అంత్యక్రియలు జరిగాయి. కె బాలు మృతి పట్ల కొందరు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేసారు. చిన్న తంబీ, పండితురై వంటి సినిమాలతో కె బాలు అభిరుచి ఉన్న నిర్మాతగా పేరు సంపాదించుకున్నాడు.

శరత్ కుమార్, కె బాలు మృతి పట్ల విచారం వ్యక్తం చేసారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన పెద్ద ఖాళీని ఏర్పరిచి వెళ్లిపోయారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నాను అని ఆయన స్పందించారు.


Recent Random Post:

9 PM | ETV Telugu News | 12th December “2025

December 12, 2025

Share

9 PM | ETV Telugu News | 12th December “2025