సంచలనం రేపిన మాజీ హాకీ క్రీడాకారుడు అతని సోదరుల కిడ్నాప్ కేసులో భూమా అఖిలప్రియను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. గాంధీ ఆసుపత్రిలో పరీక్షల అనంతరం ఆమెను సికింద్రాబాద్ జడ్జి ఇంట్లో హాజరుపరిచారు. జడ్జి ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. గాంధీ ఆస్పత్రిలో వైద్యులు జరిపిన పరీక్షల్లో ఆమెకు ఎలాంటి సమస్య లేదని వైద్యులు తేల్చారు. ఆ సమయంలో ఆమె కళ్లు తిరిగి పడిపోవడంతో కొంత అలజడి రేగింది.
ఈ కిడ్నాప్ కేసులో ఏ1గా ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి, అఖిల ప్రియను ఏ2 గా, ఆమె భర్త భార్గవ్ రామ్ ను ఏ3గా చేర్చారు. ఏవీ సుబ్బారెడ్డిని బుధవారం సాయంత్రమే హైదరాబాద్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం భార్గవ్‌రామ్ పరారీలో ఉన్నాడు. ఈ కిడ్నాప్ కేసుతో అఖిలప్రియకు సంబంధం లేదంటూ.. బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రేపు సికింద్రాబాద్ కోర్టులో విచారణ జరగనుంది.
Recent Random Post: