బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మరో 15 మందిని అరెస్టు చేశారు. వీరిలో విజయవాడకు చెందిన సిద్ధార్ధ్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. వీరిని విచారించి కీలక సమాచారాన్ని రాబట్టామని హైదరాబాద్ పోలిస్ కమిషనర్ అంజనీ కుమార్ మీడియా సమావేశంలో వెల్లడించారు.
హఫీజ్ పేటలో భూమా నాగిరెడ్డికి 33 ఎకరాల భూమి బినామీ అయిన ఏవీ సుబ్బారెడ్డి పేరుతో ఉంది. వీరు 2005లో నియమించుకున్న న్యాయవాది కృష్ణారావు కుమారుడే ప్రవీణ్ రావు. కృష్ణారావు మరణంతో ఈ వివాదాలను ప్రవీణ్ రావు, ఆయన మేనల్లుడు సునీల్ రావు చూసుకున్నారు. అయితే.. 2015లో ప్రవీణ్ రావు సోదరుల నుంచి కొంత నగదు తీసుకుని ఏవీ సుబ్బారెడ్డి వెళ్లిపోయారు. ఈ విషయం అఖిలప్రియకు తెలియడంతో ఈ భూమి తమదని మీరెలా తీసుకుంటారంటూ వాటా ఇవ్వాలంటూ ప్రవీణ్ రావుపై ఒత్తిడి తెచ్చారు. ఆయన నిరాకరించడంతో కిడ్నాప్ చేసి భూమిని రాయించుకోవాలనే ప్రయత్నంలోనే ఇదంతా జరిగింది.
ప్రస్తుతం భూమా అఖిలప్రియ చంచల్ గూడ జైలులో ఉండగా.. భర్త భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను, జగత్ విఖ్యాత్ రెడ్డి.. ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు
Recent Random Post: