పవర్ రూమ్ టాస్క్ తాజా ఎపిసోడ్ లో ముగిసింది. ఆ రూమ్ లోకి వెళ్లిన విశ్వ, మానస్, హమీద మరియు సిరిలు వెళ్లారు. చివరిగా వెళ్లిన హమీద ఒక కంటెస్టెంట్ కెప్టెన్సీ పవర్ ను పూర్తిగా లాగేసుకోవడం జరిగింది. ప్రియ ఈ సీజన్ మొత్తంలో కెప్టెన్ గా అవ్వలేరు. అందుకు ప్రియ కూడా అంగీకారం తెలియజేశారు. ఓకే ఎవరినో ఒకరిని ఎంపిక చేయాలి కదా అనుకుంటూ సర్ది చెప్పేసుకుంది. పవర్ రూమ్ లోకి వెళ్లిన నలుగురికి కెప్టెన్సీ టాస్క్ ను ఇవ్వడం జరిగింది. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ నలుగురు గార్డెన్ ఏరియాలో ఉన్న సైకిల్స్ ను కంటిన్యూస్ గా తొక్కుతూ ఉండాలి. సైకిల్ రన్ అవుతున్నా కొద్ది లైట్లు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే సైకిల్ తొక్కడ ఆగిపోతుందో వెంటనే లైట్లు ఆఫ్ అవుతాయి. తమ లైట్లను ఆఫ్ కాకుండా చూసుకుంటూ సైకిల్ తొక్కుతూ నలుగురు కంటెస్టెంట్స్ ఎక్కువ సమయం ఉండాల్సి ఉంటుంది. కొద్ది సమయం సైకిల్ తొక్కిన తర్వాత అడ్డుకోవడం చేయవచ్చు. కాని కొందరు మాత్రం సైకిల్ తొక్కడం ప్రారంభించిన వెంటనే అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా ఆర్జే కాజల్ విశ్వ మరియు మానస్ ను అడ్డుకునేందుకు ప్రయత్నించింది. ఆమె అడ్డుకునేందుకు ప్రయత్నించగా వెంటనే సరయు కూడా స్పందించి విశ్వకు మద్దతు తెలిపింది. అలా ఇద్దరి మద్య చిన్న పాటి గొడవ కూడా జరిగింది. కాజల్ తన ప్రయత్నంలో సక్సెస్ అయ్యింది. ఆయిల్ పోసి విశ్వ సైకిల్ ఆగిపోయేలా చేసింది. ఆ తర్వాత మానస్ కూడా తన ప్రయత్నంను అడ్డుకోవడంతో ఆపేశాడు. చివరకు అమ్మాయిలు ఉండగా హమీదా కూడా ఆపేసింది. దాంతో సిరి హనుమంతు విజయం సొంతం చేసుకుంది. అనూహ్యంగా సిరికి దక్కిన విజయంతో ఆమె ఆనందంతో ఎగిరి గంతేసింది. తనకు వచ్చిన అవకాశంను సద్వినియోగం చేసుకుంటాను అంది.
సంచాలక్ గా వ్యవహరించిన ప్రియ గారు సిరికి కెప్టెన్సీ బ్యాండ్ పెట్టి అభినందించింది. ఆ తర్వాత ఇంటి సభ్యులు అందరితో కూర్చుని రేషన్ మేనేజర్ గా విశ్వకు అవకాశం ఇచ్చింది. మొత్తానికి సిరి సీజన్ 5 కి మొదటి కెప్టెన్ గా నిలిచింది. ఆమె చాలా స్ట్రాంగ్ అమ్మాయి అంటూ ఈ కెప్టెన్సీ టాస్క్ తో తేలిపోయింది. ఆమె ముందు ముందు కూడా తప్పకుండా మంచి ఫర్ఫార్మెన్స్ ను కూడా ఇస్తుందని దీంతో తేలిపోయింది. చాలా చిల్ పర్సన్ కనుక కెప్టెన్సీ ని కూడా చాలా చిల్ గానే చేస్తుందని.. అందరిని ఆకట్టుకునే విధంగా ఆమె కెప్టెన్సీలో ఇంటి సభ్యులు ఉంటారు అంటూ అంతా భావిస్తున్నారు. అందరికి సన్నిహితురాలు గొడవలు లేని అమ్మాయిగా సిరికి పేరుంది. కనుక ఆమె కెప్టెన్సీలో ఇల్లు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అనేది చాలా మంది నమ్మకం. ఇక బిగ్ బాస్ సీజన్ 5 మొదటి కెప్టెన్సీ టాస్క్ రెండు దశల్లో జరిగింది. రెండు దశల్లో కూడా ప్రతిభ చూపిన వారు సిరి కాకుండా విశ్వ మరియు హమీద. ఇద్దరు కూడా చాలా కష్టపడ్డారు. ఫిజికల్ టాస్క్ ల్లో వారు ముందు ముందు ఖచ్చితంగా ప్రభావం చూపిస్తారు అనిపిస్తుంది.
Recent Random Post: