తెలుగు బిగ్ బాస్ సీజన్-4 గ్రాండ్ సక్సెస్ కావడంతో పాటు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో బిగ్ బాస్ సీజన్-5 ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణకు తెర దించుతూ త్వరలోనే బిగ్ బాస్ రాబోతున్నాడని తాజాగా బిగ్ బాస్-5 ప్రోమోను రిలీజ్ చేశారు నిర్వాహకులు. తొలిసారిగా ఓ మ్యూజిక్ వీడియోగా రూపొందించిన ఈ ప్రొమోలో హోస్ట్ అక్కినేని నాగార్జు…ఎంటర్ టైన్ మెంట్ గన్ పట్టుకొని ఎంట్రీ ఇచ్చాడు.
బిగ్ బాస్-4 ముగియడంతో వీక్షకులను బోర్ అనే చిట్టి భూతం ఆవహిస్తుంది. వారంతా బిగ్ బాస్-5 ఎంటర్ టైన్ మెంట్ కోసం పడిగాపులు పడుతుంటారు. ఈ బోర్ డమ్ భూతాన్ని తరిమికొట్టేందుకు బిగ్ బాస్ వస్తాడని అంతా ఎదురుచూస్తుంటారు. వారి నిరీక్షణకు తెర దించుతూ టీవీలో నుంచి ఎంటర్ టైన్ మెంట్ గన్ పట్టుకున్న నాగ్ ఎంట్రీ ఇస్తాడు. ఆ బోర్ డమ్ భూతంతో ప్రేక్షకులకు ఆవహించిన ‘విసుగు’ను తన వినోదపు బుల్లెట్ లతో తరిమేస్తాడు నాగ్. ఇక ఆ తర్వాత వీక్షకులతో కలిసి స్టెప్పులేస్తూ..బోర్ డమ్ కి చెప్పేయ్ గుడ్ బై…వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ ఫైవ్…అంటూ నాగ్ చెప్పే క్యాచీ డైలాగ్ ఆకట్టుకుంది.
మొత్తానికి ఈ సారి బిగ్బాస్ సీజన్ 5 ప్రొమోను వెరైటీగా ప్రజెంట్ చేశారు నిర్వాహకులు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ ప్రోమో సాంగ్ ను రాహుల్ సిప్లిగంజ్ ఆలపించగా..యశ్వంత్ నాగ్ సంగీతం అందించాడు. మరోవైపు ఈ నెల 22న జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో కర్టన్ రైజర్ కార్యక్రమం ప్రసారం కానుంది. ఆగస్టు 23 నుంచి ఆ షో మొదలవుతుందని తారక్ నటించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు నిర్వాహకులు. సెప్టెంబరు 4న బిగ్ బాస్-5 మొదలు కాబోతున్నందునే ఈ షోను ఆగస్టు 23 నుంచి మొదలుబెట్టారని టాక్ వస్తోంది. ఏది ఏమైనా…ఈ కరోనా కాలంలో ఇళ్లలో కాలం గడుపుతున్న మెజారిటీ ప్రజలకు ఈ రెండు షోలు పోటీపడి మరీ వినోదాన్నందిస్తాయనడంలో సందేహం లేదు.
కొద్దిరోజులుగా బిగ్ బాస్-5 కంటెస్టెంట్లు ఎవరు అంటూ ఊహాగానాలు మొదలైన సంగతి తెలిసిందే. దీంతోపాటు బిగ్ బాస్ ఐదో సీజన్ కు హోస్ట్ గా నాగ్ ఉండకపోవచ్చని… దగ్గుబాటి రానా ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడని పుకార్లు వచ్చాయి. అయితే ఆ అనుమానాలను పటా పంచలు చేస్తూ బిగ్ బాస్ సీజన్-5కు కూడా నాగ్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారని కొద్ది రోజుల క్రితం నిర్వాహకులు క్లారిటీ ఇచ్చారు. ఓ పక్క నాగ్..మరో పక్క తారక్..ఇద్దరూ ప్రేక్షకులకు టీవీ సెట్ ల ముందు కట్టిపడేయబోతున్నారని ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Recent Random Post: