బిగ్ బాస్ ఫైనల్ వారంకు ముందు వారం ఇది. ఈ వారం కూడా ఫైనల్ వారం అన్నంత హడావుడి కనిపిస్తుంది. హౌస్ లో కేవలం ఆరుగురు మాత్రమే ఉన్నారు. ఆరు మందిలో అఖిల్ ఇప్పటికే ఫైనల్ 5 కి ఛాన్స్ దక్కించుకుని వెళ్లి పోయాడు. ఇక మిగిలిన అభిజిత్, సోహెల్, అరియానా, హారిక మరియు మోనాల్ లను నేరుగా నామినేట్ చేయడం జరిగింది. ఈ అయిదుగురు కూడా తమ ప్రదర్శణ ద్వారా నవ్వించి మెప్పించి ఓట్లను పొందవచ్చు అంటూ రాజారాణి టాస్క్ ను ఇవ్వడం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా ఇంటి సభ్యులు అఖిల్ మినహా మిగిలిన అంతా కూడా ఓట్ల కోసం ఎంటర్ టైన్ చేయాల్సి ఉంటుంది.
రాజు అయిన సభ్యుడు ఏం చెబితే అది ఇంటి సభ్యులు అంతా కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. బిగ్ బాస్ రూల్స్ ను సైతం బ్రేక్ చేసి ఇంటి సభ్యులతో ఎంటర్ టైన్ మెంట్ ను రాజా స్తానంలో ఉన్న వారు చేయవచ్చు. సమయానుసారంగా రాజు మారి పోతూ ఉంటాడు. మొదటగా రాజా అవకాశం సోహెల్ కు దక్కింది. సోహెల్ కు మంత్రిగా అఖిల్ వ్యవహరించాడు. రాజు లేదా రాణి అయిన ప్రతి ఒక్కరికి కూడా అఖిల్ మంత్రిగా ఉంటాడు. మొదట సోహెల్ రాజుగా ఉన్న సమయంలో అరియానాతో ఒక ఆట ఆడుకున్నాడు. ఆమెతో గిన్నెలు కడిగించడంతో పాటు ఊడిపించాడు. టమాట కొట్టించాడు ఇంకా అబ్బాయి వేశం వేయించాడు. ఆ తర్వాత అభిజిత్ కు అవకాశం వచ్చింది.
ఆ సమయంలో డాన్స్ లు చేయించాడు.. ఆటలు ఆడించాడు కాస్త సందడి చేయించాడు. ఇక హారిక వంతు వచ్చినప్పుడు కాస్త సీరియస్ టర్న్ తీసుకుంది. ఆమెకు అఖిల్ ఎక్కువ సపోర్ట్ చేయడంతో పాటు ఎక్కువగా సలహాలు సూచనలు ఇస్తున్నాడు అంటూ సోహెల్ అరిచాడు. తన రెండు షూ లేస్ ను కట్టుకుని డాన్స్ చేయాల్సిందిగా హారిక ఆదేశించింది. దాంతో కోపంతో సోహెల్ మొదట నో చెప్పినా ఆ తర్వాత చేశాడు. అభిజిత్ తనను అవమానించాడు అంటూ డ్రస్ ను స్విమ్మింగ్ పూల్ లో వేసింది. మొత్తానికి తాజా ఎపిసోడ్ లో రాజురాణిగా వ్యవహరించిన సోహెల్, అభిజిత్, హారికలు సందడి చేసే ప్రయత్నం చేశారు. తదుపరి ఎపిసోడ్ లో అరియానా మరియు మోనాల్ లు రాణులుగా మారబోతున్నారు. ఆ సమయంలో ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందో చూడాలి.
Recent Random Post: