బిగ్ బాస్ 5 పూర్తవ్వడానికి ఇంకా మూడు వారాలు ఉంది. అయినా ఇది లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ అని ప్రకటించి బిగ్ బాస్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఈరోజు మొదలైంది. ఈ టాస్క్ లో భాగంగా ముందుగా నియంత సింహాసనం ఏర్పాటు చేసారు. బజర్ మోగినప్పుడు ఇంటి సభ్యులందరూ సింహాసనంపై మొదటగా కూర్చోవడానికి ప్రయత్నించాలి. ఎవరైతే ముందుగా కూర్చుంటారో వారు నియంత అవుతారు. మిగిలిన వాళ్ళు అందరూ కూడా ఒక ఛాలెంజ్ లో పాల్గొనాల్సి ఉంటుంది. ఆ ఛాలెంజ్ లో బాటమ్ 2 వచ్చిన వారు నియంత ముందు నిలబడి తమకు ఈ కెప్టెన్సీ పోటీ ఎంత ముఖ్యమో చెప్పి ఒప్పించాల్సి ఉంటుంది. అప్పుడు నియంత ఒకరిని సేవ్ చేసి ఒకరిని టాస్క్ నుండి తప్పించాల్సి ఉంటుంది. చివరిగా కెప్టెన్సీ పోటీకి నిలిచిన ఇద్దరు సభ్యులలో నుండి ఒకరిని ఓటింగ్ ద్వారా ఒకరిని ఎన్నుకోవాలి.
మొదటిసారి బజర్ మోగినప్పుడు సిరి నియంత కుర్చీలో కూర్చుంది. మిగిలిన అందరికీ హ్యాట్ టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ లో భాగంగా ఒక కొక్కానికి తగిలించి ఉన్న హ్యాట్ ను చేత్తో ముట్టుకోకుండా తలపై ధరించి ఎండ్ పాయింట్ కొక్కానికి పెట్టాలి. ఈ టాస్క్ లో సన్నీ, రవి బాటమ్ 2 లో నిలిచారు. రవిని సిరి సపోర్ట్ చేసి సన్నీను ఎలిమినేట్ చేసింది. రెండోసరి బజర్ మోగినప్పుడు శ్రీరామ్ చైర్ లో కూర్చున్నాడు. ఈసారి చెప్పుల టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ లో చెప్పులను వాల్ పై ఎవరిద్దరు తక్కువ హైట్ లో పెడతారో వాళ్ళు బాటమ్ 2 గా నిలుస్తారు. కాజల్, రవి బాటమ్ 2 లో ఉండగా, శ్రీరామ్ అందరూ అనుకున్నట్లుగానే రవిని సేవ్ చేసాడు.
మూడోసారి రవి ఆ కుర్చీలో కూర్చున్నాడు. ఈసారి తలపై ఆరంజ్ లను పెట్టి ఎండ్ పాయింట్ కు తీసుకెళ్లాలి. ఈ టాస్క్ లో షణ్ముఖ్, మానస్ బాటమ్ 2 లో ఉండగా రవి, షణ్ముఖ్ ను సేవ్ చేసాడు. నాలుగోసారి కుర్చీపై ప్రియాంక కూర్చుంది. మిగిలిన కంటెస్టెంట్స్ కు వాటర్ టాస్క్ ఇచ్చారు. అంటే టబ్ ఎదురుగా నిలబడి తమ వెనకాల ఉన్న టిన్ లో వాటర్ వేయాలి. ఆ టాస్క్ లో షణ్ముఖ్, శ్రీరామ్ చివరిగా రాగా ప్రియాంక, షణ్ముఖ్ ను సేవ్ చేసింది.
ఐదోసారి బజర్ మోగినప్పుడు సిరి, ప్రియాంక కూడా కుర్చీలో మొదటగా కూర్చోవడానికి ప్రయత్నించారు. సిరి తనే ముందు కూర్చున్నాను అని చెబుతోంది కానీ మానస్ మాత్రం ప్రియాంక అని చెప్పాడు. మరి ఈ విషయంలో ఎవరు కరెక్ట్ అన్నది చూడాలి. ఇప్పటికే సన్నీ, కాజల్, మానస్, శ్రీరామ్ లు ఎలిమినేట్ అయ్యారు. ఇంకా పోటీలో షణ్ముఖ్, సిరి, రవి, ప్రియాంకలు ఉన్నారు. మరి వీరిలో ఎవరు కెప్టెన్ అవుతారో చూడాలి.
Recent Random Post: