బిగ్ బాస్ 5: నామినేషన్స్ లో షణ్ముఖ్ కు మోగిన మోత- ఎపిసోడ్ 30

బిగ్ బాస్ 5 లో అత్యంత ఆసక్తికర ఘట్టమైన నామినేషన్స్ ఎపిసోడ్ ఈరోజు జరిగింది. ఐదవ వారం నామినేషన్స్ ను కొంచెం కొత్తగా డిజైన్ చేసాడు బిగ్ బాస్. ఓపెన్ నామినేషన్స్ కాకుండా కన్ఫెషన్ రూమ్ కు పిలిచి నామినేషన్స్ ఇవ్వమన్నారు. ఒకరి తర్వాత ఒకరుగా కన్ఫెషన్ రూమ్ కు వెళ్లి నామినేషన్స్ ఇచ్చారు.

ముందుగా జెస్సీను పిలవగా తనను కించపరుస్తున్నాడు అన్న ఉద్దేశంతో రవిని, తన వల్లే జైలుకి వెళ్లాల్సి వచ్చింది కాబట్టి లోబోని నామినేట్ చేసాడు. తర్వాత వచ్చిన సన్నీ – ప్రియా, షణ్ముఖ్ లను నామినేట్ చేసాడు. ఇక కాజల్ సన్నీ, రవిలను నామినేట్ చేసింది. అలాగే లోబో – మానస్, షణ్ముఖ్ లను నామినేట్ చేసాడు. ప్రియాంక ఏమో హమీద, లోబోలను నామినేట్ చేసింది. సిరి – రవి, హమీదల పేర్లు చెప్పింది. రవి – జస్వంత్, షణ్ముఖ్ ల పేర్లు తెలిపాడు. అన్నీ మాస్టర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ను నామినేట్ చేస్తూ వస్తోంది. అదే ఉద్దేశంతో ఈసారి రవి, విశ్వలను నామినేట్ చేసింది.

షణ్ముఖ్ – విశ్వ, మానస్ ల పేర్లు చెప్పాడు. అలాగే హమీద్ – ప్రియా, షణ్ముఖ్ లను నామినేట్ చేసింది. శ్వేతా – కాజల్, మానస్ లను నామినేట్ చేయగా, ప్రియా – షణ్ముఖ్, సన్నీల పేర్లు చెప్పింది. మానస్, శ్రీరామ్ లు ఇద్దరూ జస్వంత్, షణ్ముఖ్ లను నామినేట్ చేసారు. మొత్తంగా చూసుకుంటే ఒక్క జెస్సీ తప్ప మగవాళ్ళు అందరూ షణ్ముఖ్ ను నామినేట్ చేయడం విశేషం. మొత్తంగా షణ్ముఖ్ కు ఎనిమిది నామినేషన్స్ వచ్చాయి. దీనిపై షణ్ముఖ్ కూడా ఆనందం వ్యక్తం చేసాడు. తను గేమ్ ఆడుతున్నా అని అందుకే అందరూ నామినేట్ చేస్తున్నారని చెప్పాడు.

మొత్తంగా ఈవారం నామినేషన్స్ లో షణ్ముఖ్, జెస్సీ, రవి, లోబో, సన్నీ, హమీద, మానస్, విశ్వ, ప్రియాలు ఉన్నారు. కన్ఫెషన్ రూమ్ లో జరిగిన సీక్రెట్ నామినేషన్స్ అయినా కూడా బిగ్ బాస్ ఎవరెవరు ఎవరిని నామినేట్ చేసారు అన్నది చెప్పి చిన్న ట్విస్ట్ ఇచ్చాడు. మరి వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది చూడాలి.

ఇక దీని తర్వాత శ్రీరామ్ చంద్ర, చపాతీలు బాల్స్ లా చేయమని జెస్సీకు చెప్పగా తాను చేయనని అనడంతో శ్రీరామ్ చంద్ర అయితే ఎవరి వంట వారు వండుకోవాలని అన్నాడు. దీంతో జెస్సీకు సపోర్ట్ గా షణ్ముఖ్, సిరి, కాజల్ లు వచ్చారు. శ్రీరామ్ చంద్ర అలా అనడంతో అలిగిన జెస్సీ, షణ్ముఖ్, సిరిలు ఈరోజు ఏం తినమని చెప్పారు. ఇక ఆఖర్లో శ్రీరామ్ చంద్ర ప్లేట్ లో ఫుడ్ పెట్టుకుని వచ్చి తినిపించడంతో వాళ్ళు తిన్నారు.


Recent Random Post: