మరో నటుడు కరోనాతో మృతి

Share

కరోనా కారణంగా పదుల సంఖ్యలో సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ దిగ్గజాలను కోల్పోయాం. కరోనా తో ఎంతో మంది మృతి చెందుతూనే ఉన్నారు. ఇటీవల మరో నటుడు కూడా కరోనాతో మృతి చెందారు. సీనియర్‌ కన్నడ నటుడు బీఎం కృష్ణ గౌడ 80 ఏళ్ల వయసులో కరోనాతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. ఆయన మృతి కన్నడ సినీ పరిశ్రమను దుఃఖంలో ముంచేసింది.

రంగస్థల నటుడిగా కెరీర్‌ ను మొదలు పెట్టి ఎన్నో సినిమాల్లో నటించిన ఆయన టీవీ సీరియల్స్ లో కూడా కనిపించారు. 20 రోజుల క్రితం కరోనా బారిన పడ్డ ఆయన కోలుకుని ఇంటికి వచ్చారు. ఆయన మళ్లీ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ వచ్చారు. గత రాత్రి సమయంలో ఆయన గుండె పోటుతో మృతి చెందారంటూ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కరోనా కారణంగానే ఆయన ఆరోగ్యం క్షీణించి చివరకు మృతి చెందారని వైధ్యులు పేర్కొన్నారు.


Recent Random Post: