ప్రజాస్వామ్యం ఖూనీ: కుప్పంలో మాత్రమేనా.? నంద్యాలలో కాదా.?

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి విపరీతమైన కోపమొచ్చేసింది.. సొంత నియోజకవర్గం కుప్పంలో తెలుగుదేశం పార్టీని కాదని పంచాయితీ ఎన్నికల్లో ఓటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టడం కట్టడాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి, పంచాయితీ ఎన్నికలు.. పార్టీల గుర్తుల మీద జరగలేదు. ఆ లెక్కన, పంచాయితీ ఎన్నికల్లో గెలుపోటముల గురించి ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ.. అని చెప్పుకునే చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమే. కానీ, గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు ఎలా మారిపోయాయో చంద్రబాబుకి బాగా తెలుసు. అందుకే, తెగ గుస్సా అయిపోతున్నారు. అధికార పార్టీ గెలుపుకి ప్రతిపక్షం సర్టిఫికెట్ ఇచ్చేసింది.

‘వందల కోట్లు ఖర్చు చేశారు కుప్పం నియోజకవర్గంలో పంచాయితీ ఎన్నికల్ని గెలవడానికి..’ అంటూ చంద్రబాబు తెగ బాధపడిపోయారు. గెలిచింది వైసీపీ కాదు.. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందంటూ చంద్రబాబు వాపోయారు. అరరె, ప్రజాస్వామ్యం ఇప్పుడు కొత్తగా ఖూనీ అయ్యేదేముంది.? వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కుని మంత్రి పదవులిచ్చినప్పుడే ఖూనీ అయ్యింది. నిజానికి అంతకు ముందూ పలుమార్లు ప్రజాస్వమ్యం ఖూనీ అయ్యింది. వైసీపీ హయాంలోనూ ఖూనీ అవుతూనే వుంది. నంద్యాల ఉప ఎన్నకల్ని తీసుకుంటే, ‘నేనిచ్చిన రోడ్ల మీద నడుస్తారు.. నాకు ఓట్లెయ్యరా.?’ అని ఇదే చంద్రబాబు ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించిన విషయాన్ని ఎలా మర్చిపోగలం.? అదే అహంకారాన్న వైసీపీ నేతలూ ప్రదర్శిస్తున్నారు. టీడీపీకి పట్టిన దుర్గతే తమకూ పట్టాలని వైసీపీ నేతలు ఉవ్విళ్ళూరుతున్నట్టున్నారు.

అందుకే, నంద్యాలలో టీడీపీ ఎలాగైతే కోట్లు గుమ్మరించి గెలిచిందో.. పంచాయితీ ఎన్నికల్లో అవసరం లేకపోయినా ఆ స్థాయిలో ఖర్చు చేసింది. ఓ అంచనా ప్రకారం, కుప్పం నియోజకవర్గంలోనే ఏకంగా 95 కోట్లు ఖర్చు చేసిందట అధికార పక్షం. నిజమేనా.? ఆ స్థాయిలో ఖర్చు చేయాల్సిన అవసరం వుందా.? అంటే, గ్రామ స్థాయిలో నోట్ల కట్టలు హల్‌చల్ చేసిన వైనాన్ని బట్టి చూస్తే అది నిజమేననుకోవాలేమో. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే టీడీపీకి సమాధి కట్టిన ఆంధ్రపదేశ్ ఓటర్లు, అతి త్వరలో వైసీపీకి కూడా సమాధి కట్టాల్సిందేనేమో.!


Recent Random Post: